Take a fresh look at your lifestyle.

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి

సంగారెడ్డి, ప్రజాతంత్ర,డిసెంబర్ 11: ప్రజావాణి  ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు  సత్వరమే పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలు లో నిర్వహించిన   ప్రజావాణి  కార్యక్రమానికి జిల్లా నలు మూలల నుండి   వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ శరత్ అదనపు కలెక్టర్ మాధురి తో కలిసి  ఫిర్యాదుల స్వీకరించారు. పలువురు భూ సంబందిత సమస్యలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు, ఉద్యోగం చూపాలని, ట్రై సైకిల్స్ ,వికలాంగుల ఫించన్ అందజేయాలని కోరుతూ ఆర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయకుండా  ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో  27 దరఖాస్తులు వచ్చాయని, అందులో 9 రెవెన్యూ శాఖకు సంబంధించినవి కాగా,  ఇతర శాఖలకు సంబంధించి 18 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. గుమ్మడిదల మండలం నాగిరెడ్డి గూడెం కు చెందిన మహిళ తన భర్త పేరిట ఉన్న 5 ఎకరాల భూమిని తన పేరున మార్చాలని కోరుతూ కలెక్టర్కు అర్జీ అందజేయగా, కలెక్టర్ స్పందించి వెంటనే గుమ్మడిదల తహసిల్దార్ తో ఫోన్లో మాట్లాడి అట్టి విషయమై వెంటనే చర్యలు తీసుకో వాల్సిందిగా తహసిల్దార్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, డిఆర్ఓ నగేష్, జిల్లా అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply