Take a fresh look at your lifestyle.

స్వీయనియంత్రణే కొరోనా కట్టడికి మంత్రం

  • తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందే వెల్లడించిన వైద్య నిపుణులు

స్వీయ రక్షణ చర్యలతోనే కరోనాకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రముఖ వైద్యులు మరోమారు వెల్లడించారు. కరోనా వైరస్‌ ‌వ్యాప్తి, తీసుకోవల్సిన జాగ్రత్తలను తెలుసుకుని ఖచ్చితంగా పాటిస్తే కరోనాపై విజయం సాధించవచ్చని ఉస్మానియా జనరల్‌ ‌హాస్పిటల్‌ అసోసియేట్‌ ‌ప్రొఫెసర్‌ ‌డాక్టర్‌ ‌సృజన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన డియా సమావేశంలో పలువురు వైద్యనిపుణులు మాట్లాడారు. ఈసందర్భంగా డాక్టర్‌ ‌సృజన్‌ ‌మాట్లాడుతూ సాధారణంగా 80 నుంచి 85శాతం మందిలో జలుబు, తలనొప్పి, గొంతునొప్పి వంటి లక్షణాలు వస్తాయని, అవి చాలా వరకు తగ్గుముఖం పడతాయని అన్నారు. తీవ్రస్థాయిలో ఉన్నవారికి శరీరంలో ఆక్సీజన్‌ ‌శాతం తగ్గే అవకాశం ఉంటుందన్నారు. కాబట్ట స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనా సోకకుండా చూసుకోవచ్చన్నారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటూ, బయటకు వెళ్లకుండా ఉండాలన్నారు. బయటకు వెళితే తప్పని సరిగా మాస్క్ ‌ధరించాలన్నారు.

చేతును ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్ర పర్చుకోవాలని సూచించారు. తీవ్ర వ్యాధులతో బాధపడే వారు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ డాక్టర్‌ల సలహా తీసుకుంటుంటూ తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అపోలో మెడికల్‌ ‌కాలేజీ పల్మనాలజిస్ట్ ‌ప్రొఫెసర్‌ ‌డాక్టర్‌ ‌జయశ్రీ మాట్లాడుతూ ఎన్‌95 ‌మాస్కులు వైద్య సిబ్బందికి వసరమని, సాదారణ ప్రజలు సర్జికల్‌ ‌లేదా బట్ట మాస్కులను ధరించ వచ్చన్నారు. మాస్క్‌లను ముట్టుకోకూడదని, అనివార్యంగా ముట్టుకుంటే చేతులను తప్పని సరిగా శుభ్రం చేసుకోవాలసి సూచించారు. ఇంట్లో ఉండే తలుపుల నాబ్స్, ఎలక్ట్రికల్‌స్విచ్‌లను విధిగా శుభ్రపర్చాలన్నారు. బయటి నుంచి తెచ్చిన సరుకులను 2 నుంచి 3 రోజుల తర్వాత వాడుకోవాలన్నారు. కూరగాయలను ఉప్పునీటిలో కడిగి వాడుకోవాలని ఆమె సూచించారు. బయట ఆహారాన్ని తీసుకోకుండా ఇంట్లోనే తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. త్వరలో కొత్త మందులు రాబోతున్నాయని దాదాపు అన్నీ ట్రయల్స్ ‌దశలో ఉన్నాయని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఎ•-లాస్మా థెరపీ ప్రారంభమైందని చెప్తూ మైల్డ్ ‌లక్షణాలు ఉన్నరోగులు •మ్‌క్వారంటైన్‌తోనే వ్యాధిని తగ్గించుకోవచ్చని అన్నారు. ఈసమావేశంలో అడిషనల్‌ ‌డైరెక్టర్‌ ‌నాగయ్యకాంబ్లే, జాయింట్‌ ‌డైరెక్టర్‌ ‌జగన్‌, ‌సీఐఈ విజయభాస్కర్‌రెడ్డి, అసిస్టెంట్‌ ‌డైరెక్టర్‌ ‌యామిని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply