Take a fresh look at your lifestyle.

మొరాకా దుర్ఘటనలో 2100 మందిపైగా మృతి

• శిథిలాల కింద ఇంకా అనేకమంది
• కొనసాగుతున్న సహాయక చర్యలు
• భూకంపం ధాటికి నిరాశ్రయులైన వేలాదిమంది

న్యూదిల్లీ, సెప్టెంబర్‌11: ‌మొరాకోలో సంభవి ంచిన భారీ భూకంపం ఒక్కసారిగా పరిస్థితుల్ని మార్చేసింది. ఈ దుర్ఘటనలో 2100 మంది పైగా మృతి చెందడం కలకలం రేపుతోంది. శిథి లాల కింద ఇంకా అనేక మంది చిక్కుకపో యారు. వారు బయటకు వస్తారన్న ఆశలు కూడా క్రమంగా కనుమరు గైపోతున్నాయి. ఇప్పటికే భూకంపం సంభవించి 48 గంటలు దాటింది. ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా.. కొండ ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో భూకంపం ధాటికి ఇళ్లు ధ్వంసమవ్వడంతో.. సహాయక బృందాల కోసం అక్కడి బాధితులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇక భూకం పానికి కేంద్ర స్థానమైన అట్లాస్‌ ‌పర్వతాలకు కేవలం ఒక కిలోమీటరు మత్రమే దూరంలో ఉన్న తిఖ్త్ అనే కుగ్రామం నేలమట్టమైపో వడంతో ఆందోళన నెలకొంది. ఇక్కడి శిథిలాల్లో వెలకితీత కోసం చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలు పూర్తిగా కట్టుబట్టలతో మిగిలిపో యవడం దృశ్యాలు అందరిని కలిచివేస్తున్నాయి.

మరోవైపు మొరాకోలోని భూకంప బాధితులకు సహాయం చేసేందుకు విదేశీ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పుడిప్పుడే ఆ దేశానికి చేరుకుంటున్నాయి. మరో విషయం ఏంటంటే ఇప్పటికే మొరాకో ప్రభుత్వం యూకే, యూఏఈ, ఫ్రాన్స్, ‌ఖతర్‌, అమెరికా వంటి దేశాల నుంచి సహాయాన్ని అంగీకరించింది. అలాగే పొరుగున ఉన్నటువంటి స్పెయిన్‌కు చెందిన రెండు బృందాల్లో 86 మంది నిపుణులు జాగీలాలతో మొరాకోకి చేరుకున్నారు. మరోవైపు యూకే నుంచి మరో 60 మంది సిబ్బంది, రెండు సైనిక రవాణా హెలికాప్టర్లు, వైద్య బృందాలు కూడా బయలుదేరాయి. ఇక తమ దేశానికి సాయం ప్రకటించిన దేశాలకు మొరాకో రాజు మహమ్మద్‌ – 6 ‌ధన్యవాదాలు చెప్పారు. ఇదిలా ఉండగా మరో ఆందోళనకర విషయం నెలకొంది. ఇప్పటికే అట్లాస్‌ ‌పర్వత ప్రాంతాలను వీడి చాలా మంది ప్రజలు ఇతర ప్రదేశాలకు వలస వెళ్లిపోతున్నారు.

120 ఏళ్లలో ఇప్పుడు వచ్చిన ఈ భారీ భూకంపం అక్కడి గ్రామాలను కుదిపేసింది. చాలావరకు ఇళ్లు నెలమట్టమైపోయాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మౌల్య బ్రహిమ్‌ అనే గ్రామంలో 25 మంది మృతి చెందారు. మరో ముగ్గురి ఆచూకి కనిపించడం లేదు. కఠిన అట్లాస్‌ ‌పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు చేరుకునేందుకు సహాయక బృందాలకు సైతం ఇబ్బందిగా మారుతోంది. అక్కడ కనీసం రోడ్లు కూడా లేవు. దీంతో ఇక చేసేదేమి ఆ ప్రాంత వాసులే తమ గ్రామాలను వీడి వలస వెళ్లిపోతున్నారు. ఇదిలా ఉండగా భూకంపం ధాటికి కూలిన నిర్మాణాల శిథిలాలను వెలికి తీసేకొద్ది వందల సంఖ్యలో మృతదేహాలు బయటపడటం కలకలం సృష్టిస్తోంది. మరోవైపు సహాయక చర్యలు సైతం ముమ్మురంగా సాగుతున్నాయి.

Leave a Reply