Take a fresh look at your lifestyle.

దళిత ఎంఎల్‌ఏల నియోజకవర్గాల్లోని.. మరో నాలుగు మండలాల్లో ‘దళిత బంధు’

అమలుకు సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని నిర్ణయించి హుజూరాబాద్‌లో పైలట్‌ ‌ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పథకం లోతుపాతులను, దళిత ప్రజల యొక్క మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో వున్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న 4 నియోజకవర్గాల్లోని 4 మండలాలు..ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం, నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్‌ ‌నియోజకవర్గం నిజాం సాగర్‌ ‌మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు దళితబంధును అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిర్ణయించారు.

ఈ 4 మండలాల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేయనుంది. సీఎం కేసీఆర్‌ ‌ఢిల్లీ పర్యటన ముగించుకుని వొచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్‌లో సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించిన అనంతరం ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నట్టు సిఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలిపారు.

Leave a Reply