Take a fresh look at your lifestyle.

ప్రమాదాలు జరిగిన వెంటనే.. అత్యవసర వైద్యం

  • రహదారి భద్రతలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
  • అధికారులకు సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ఆదేశం

రాష్ట్రంలో రహదారి భద్రతపై అన్ని జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఆర్‌అం‌డ్‌బీ, పోలీసు, వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎస్‌ ‌సమావేశ మయ్యారు. ప్రమాదాలు జరిగిన వెంటనే గోల్డెన్‌ అవర్‌లో అత్యవసర వైద్యాన్ని అందించేందుకు వీలుగా అంబులెన్స్ ‌సేవలు, హాస్పిటళ్లు, ట్రామా కేర్‌ ‌సెంటర్ల అనుసంధాన ప్రణాళికపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ట్రామా కేర్‌ ‌కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి నిమ్స్ ‌ద్వారా ఎమర్జెన్సీ మెడిసిన్‌లో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే రక్తస్రావాన్ని అరికట్టి మరణాలను తగ్గించేలా తీసుకునే చర్యలపై శిక్షణ ఇచ్చేందుకు
అవసరమైన సిబ్బందిని గుర్తించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.

- Advertisement -

బాహ్యవలయ రహదారిపై ప్రమాదాలను తగ్గించేలా ఫెన్సింగ్‌, ‌క్రాసింగ్స్ ‌బోర్డుల ఏర్పాటు, విద్యుత్‌ ‌దీపాలు, కెమెరా ఆధారిత వేగ నియంత్రణ తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను సీఎస్‌ ఆదేశించారు. సురక్షిత డ్రైవింగ్‌పై ప్రభుత్వ డ్రైవర్లకు ఒక రోజు శిక్షణ ఇవ్వాలని అధికారులను సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో రహదారి భద్రతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌  ‌బీఆర్‌కే భవన్‌లో సక్ష నిర్వహించారు. అన్ని జిల్లాలకు రహదారి భద్రతా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి అని ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, గో•ల్డెన్‌ అవర్‌లో వైద్యసాయం అందించి ప్రాణాలు కాపాడేలా చూడాలన్నారు. ప్రమాదాల సందర్భంగా క్షతగాత్రుల మరణాల సంఖ్యను తగ్గించే నిమిత్తం ఈఎంఆర్‌ఐ ‌ద్వారా అందించే యాక్టివ్‌ ‌బ్లీడింగ్‌ ‌కంట్రోల్‌పై మాస్టర్‌ ‌శిక్షణ కోసం వైద్య శాఖ సిబ్బందిని గుర్తించాలని ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ఏఎన్‌పీఆర్‌ ‌కెమెరాల ద్వారా వేగ నియంత్రణ, పర్యవేక్షణతో పాటు తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ ‌శర్మ, అడిషనల్‌ ‌డిజి జితేందర్‌, ‌హోంశాఖ ముఖ్య కార్యదర్శి  రవిగుప్తా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, సందీప్‌ ‌శాండిల్య, రవాణా శాఖ కషనర్‌ ‌యంఆర్‌యం రావు,  బీ విజేంద్రా, ప్రత్యేక కార్యదర్శి  సంతోష్‌ ‌పిడి, ఓఆర్‌ఆర్‌, ‌తదితర అధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply