Take a fresh look at your lifestyle.

డిసెంబర్ లో గీతం పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 9: హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2011 నుంచి 2020 మధ్య విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని డిసెంబర్ 22-23 తేదీలలో నిర్వహించనున్నట్టు అలుమినీ సమన్వయకర్త ప్రొఫెసర్ పి.త్రినాథరావు గురువారం వెల్లడించారు. డిసెంబర్ 22న (శుక్రవారం) నెట్ వర్కింగ్ డిన్నర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆరంభమవుతుందని, తమతో పాటు విద్యనభ్యసించిన వారిని మరోసారి కలుసుకోవడానికి, కొత్త పరిచయాలు ఏర్పరచుకోవడానికి ఇది తోడ్పడుతుందని ఆయన తెలిపారు. అంతేగాక, పూర్వ విద్యార్థుల అత్యుత్తమ విజయాలను గుర్తిస్తూ, వారికి అవార్డులు ఇచ్చి గౌరవిస్తామన్నారు. డిసెంబర్ 23న (శనివారం) గీతంలోని వివిధ విభాగాలను సందర్శించడంతో పాటు తమ విద్యా సంబంధ మూలాలను మళ్లీ సందర్శించే వీలు కల్పిస్తున్నట్టు డాక్టర్ త్రినాథరావు చెప్పారు. వారు చదివినప్పటికీ, ఇప్పటికీ జరిగిన వృద్ధి, పురోగతిని స్వయంగా వీక్షించొచ్చన్నారు. దీనికి అదనంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలతో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని మరింత ఆస్వాదించి, ఆనందించే ఏర్పాటుచేసి మరపురాని మధురానుభూతిని మిగిల్చేలా చేయాలని సంకల్పించినట్టు చెప్పారు. ఇందులో పాల్గొనాలనే ఆసక్తి గల గీతం పూర్వ విద్యార్థులుhttps://alumni.gitam.edu/events/event/ 347599.dz ఈ లింక్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని డాక్టర్ త్రినాథరావు సూచించారు. మరింత సమాచారం కోసం 78425 30045ను సంప్రదించాలని, లేదా alumnirelations@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలన్నారు.

Leave a Reply