Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో కుటుంబ పాలన

  • వొచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యం
  • బండి యాత్రలో పాల్గొన్న మాజీమంత్రి జవదేకర్‌
  • ‌నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్‌ అని బండి విమర్శ
  • డ్రగ్స్ ‌ఛాలెంజ్‌లతో బిజెపి యాత్రల నుంచి దృష్టిని మరల్చే కుట్ర అని ఆరోపణ

తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ ‌జావడేకర్‌ ‌విమర్శించారు. ఏడేళ్ల పాలనలో ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బండి సంజయ్‌ ‌చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ ‌చౌరస్తాకు చేరుకున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జావడేకర్‌ ‌పాల్గొని మాట్లాడారు. ప్రజల్ని మభ్యపెడుతున్న తెరాస ప్రభుత్వాన్ని సాగనంపాలి. తెలంగాణలో హైవేల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నాం.

2023 ఎన్నికల్లో తెరాసతో ఉద్యమమే. హుజూరాబాద్‌ ఎన్నికల్లో భాజపాదే విజయమని జావడేకర్‌ అన్నారు. వొచ్చే ఎన్నికల్లో తెరాసను ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ ‌పాదయత్రాతో మంచి స్పందన వొస్తుందని అన్నారు. ఇదిలావుంటే భూముల ఆక్రమణ కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రత్యేకంగా ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌ ‌ఘాటుగా విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్ర వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యుల కోసమే ధరణి పోర్టల్‌ను తీసుకు వొచ్చారని విమర్శించారు. హైదరాబాద్‌ ‌శివారులోని వేల ఎకరాల భూమిని ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించుకుని భూములను క్రమబద్ధీకరించుకున్నారని తెలిపారు. ధరణి పోర్టబుల్‌తో పేద ప్రజలకు చిక్కులు వొచ్చి పడ్డాయని అన్నారు.

ఎంతోమంది పేద రైతుల భూములు ధరణి పోర్టల్‌లో క్రమబద్ధీకరణ కావడం లేదన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఎత్తిచూపితే  కేసులు పెడుతున్నారని అన్నారు. ఎంతమంది నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇచ్చారో చెప్పాలన్నారు. అలాగే ఎంతమంది దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేశారో చెప్పాలన్నారు. రైతులు పండించి పంటలు కొనుగోలు చేయలేరా? అని బండి సంజయ్‌ ‌ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటలు వరి, మక్కలు కొనుగోలు చేయకుంటే  మెడలు వంచి కొనుగోలు చేయిస్తామని హెచ్చరించారు.

డ్రగ్స్ ‌ఛాలెంజ్‌లతో బిజెపి యాత్రల నుంచి దృష్టిని మరల్చే కుట్ర అని ఆరోపణ
బిజెపి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర దృష్టి మళ్లించేందుకే డ్రగ్స్ ‌ఛాలెంజ్‌లను లేవనెత్తారని బండి సంజయ్‌ అన్నారు. సవాళ్లన్నీ కాంగ్రెస్‌,‌టీఆర్‌ఎస్‌ ‌ల డ్రామాలేనన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ‌గుండాల అరాచకాలు పెరిగిపోయాయన్న బండి..మజ్లీస్‌ ‌ను నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు.

తెలంగాణ, హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఉద్యమం పేరుతో టీఆర్‌ఎస్‌ ‌నేతలు నీరుగార్చారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శించారు. కామారెడ్డిలో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న ఆయన..ఈ సందర్భంగా మాట్లాడారు. పేదల ఆత్మ బలి దానాలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని..కరసేవకుల బలిదానాలతోనే అయోధ్యలో రామమందిరం నిర్మాణం అవుతోందన్నారు. బెల్లంపై కేసీఆర్‌ ఆం‌క్షలు పెట్టారని..సీఎం మూర్ఖపు విధానాలతో రైతులు చెరుకు సాగు మానేశారని ఆరోపించారు.

అంతేకాదు ..నిజాం షుగర్‌ ‌ఫ్యాక్టరీని ఎందుకు మూసేశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. వరిసాగుపై రైతులకు కేసీఆర్‌ ‌భరోసా కల్పించాలన్నారు. మొక్క జొన్నలు కొనకపోతే కేసీఆర్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌ ‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సీఎం మెడలు వంచి మొక్కజొన్నలను కొనిపిస్తామన్నారు.  . డ్రగ్స్ ఎవడికి అవసరం? పేదోళ్లకు డ్రగ్స్ ‌తీసుకునే అవసరం లేదన్నారు.

Leave a Reply