Take a fresh look at your lifestyle.

కానిస్టేబుల్ ఫలితాలలో సత్తా చాటిన ఏకేఆర్ విద్యార్థులు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: ఏకేఆర్ స్టడీ సర్కిల్ లో శిక్షణ పొందిన కానిస్టేబుల్ అభ్యర్థులు కానిస్టేబుల్ ఫలితాల్లో సత్తా చాటి ఈ ప్రాంతానికి మంచి పేరు సాధించారని ఏకేఆర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బివి రమణ పేర్కొన్నారు. ఇటీవలే విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో స్థానిక ఏ కే ఆర్ స్టడీ సర్కిల్ కు చెందిన ప్రియాంక గౌడ్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ విభాగంలో వికారాబాద్ జిల్లా మొదటి ర్యాంకును, అదేవిధంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ జిల్లా రెండవ ర్యాంకును మహమ్మద్ అజారోహద్దీన్ సాధించారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులలో ఏఆర్ విభాగంలో శ్రీనివాస్ కు 10 వ ర్యాంక్ అదే విధంగా రుక్మిణికి 11వ ర్యాంక్ రానికి 19వ ర్యాంకు వచ్చిందని  అదేవిధంగా సబితా గౌడ్ కు ఎక్సైజ్ కానిస్టేబుల్ విభాగంలో జిల్లా 21వ ర్యాంక్ వచ్చిందని ఆయన తెలిపారు… అదేవిధంగా సాయి వర్ధన్ గౌడ్, సమీర్ ,రాజశేఖర్, సంతోష్, నవీన్ గౌడ్, అరవింద్ ,మాణిక్ రెడ్డి ,సతీష్ కుమార్ ,ఉత్తమ ర్యాంకులు సాధించి కానిస్టేబుల్ విభాగాలలో ఎన్నికయ్యారు అని ఆయన తెలిపారు. తమ స్టడీ సర్కిల్ నుండి రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి జిల్లా విద్యార్థులు 60 మందికి పైగా ఎన్నికయ్యారని ఆయన పేర్కొన్నారు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు..

Leave a Reply