Take a fresh look at your lifestyle.

మత సామరస్యానికి ప్రాధాన్యతనిచ్చిన శివాజీ

శివాజీ మతసామరస్యం ఉన్న రాజు కావటం వలన, భూ, జల సైన్య నియామకాలు మతరహితంగా ఉండేవి. అంచేత శివాజీ సైన్యంలో అత్యధిక ముస్లింలు ఉండేవారు. శివాజీ రాజ్యంలో గూడచారి విభాగానికి అధిపతిగా మౌలానా హైదర్‌ అలీ ఉండేవారు. శివాజీకి నిఘా విభాగానికి సంబంధించి అన్ని విషయాలు ఈయనే ఛత్రపతి శివాజీకి అందించే వారు. శివాజీ ఆయుధ భాండాగారంలో యుద్ధ తోపుల విభాగానికి అధిపతిగా ఇబ్రహీం ఖాన్‌ ‌పనిచేశారు. జల సైన్యానికి అధిపతిగా సిద్ధి సంబల్‌ ఇ‌బ్రహీం పని చేశారు.

శివాజీ.. చత్రపతి శివాజీ మహారాజ్‌గా ఆనాటి ప్రజల మన్ననలు పొందటానికి కారణం ఛత్రపతి శివాజి కనబరిచిన మతసామరస్యం. ఈ విషయాలన్నీ మరుగున పెడుతూ..ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ‌ముస్లిం రాజులను వ్యతిరేకించే హిందూ రాజు అన్న దృష్టికోణంతో ఛత్రపతి శివాజీను చూపించటం లేదా ఛత్రపతి శివాజీ కేవలం హిందూ మహా రాజు అని ప్రచారం చేయటం శివాజీ మహారాజ్‌కు చేసే అతిపెద్ద అన్యాయమని చరిత్రకారుడు సర్దేశాయి తన పుస్తకం ‘‘న్యూ హిస్టరీ ఆఫ్‌ ‌మరాఠా’’లో పేర్కొన్నారు.

shivaji

ప్రకృతి..చరిత్ర.. స్త్రీ..వీటి మధ్య చాలా సారూప్యత ఉంది..ఈ మూడు తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉంటాయి. ఈ మూడు చేసే పనిని భిన్న భిన్న వ్యక్తులు తమ పెర్స్పెక్టివ్‌ ఆధారంగా భిన్న కోణాలలో నిర్వచిస్తూ ఉంటారు. ఈ రోజు శివాజీ పుట్టిన రోజు అని దేశవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్‌లు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో..జీజాబాయి,కొడుకు ఛత్రపతిశివాజీ మహరాజ్‌కి సంబంధించిన చరిత్రకు భిన్న భిన్న వ్యక్తులు ఇచ్చిన దృష్టికో ణాలు ఏంటో పరిశీలిద్దాం..శివాజీకి సంబంధించిన చరిత్రను లోకమాన్య తిలక్‌ ‌దృష్టికోణంలో చదివితే మనకు ఛత్రపతి శివాజీ ‘‘గో బ్రాహ్మణ పరిపాలక’’ రాజుగా కనిపిస్తారు. ఈ దృష్టికోణాన్ని సుమారు ముప్పై ఏళ్ల క్రితం బల్వాన్ట్ ‌మోరేశ్వర్‌ ‌పురంధరే అనే కళాకారుడు ‘‘జానతా రాజా’’ అనే మరాఠీ నాటకం ద్వారా బాగా పాపులర్‌ ‌చేశారు. మహారాష్ట్రలో లోకమాన్య తిలక్‌ ‌దృష్టికోణంతో శివాజీ మహారాజ్‌ను చదివిన అధిక ప్రజలు ఆయనకు ముస్లిం రాజుల వ్యతిరేక హిందూ రాజు అని తమ మనసులో నిలుపుకొని ఆరాధిస్తారు. అదే మహారాష్ట్రలో శివాజీకి సంబంధించిన చరిత్రను మహాత్మ జ్యోతి రావు పూలే దృష్టికోణంతో చదివిన కొంత మంది ప్రజలు శివాజీని ‘‘లోకకల్యాణం కోసం పని చేసిన మహారాజు’’ అని శివాజీని తమ గుండెల్లో నింపుకుని ఆరాధిస్తారు. ఈ రెండు వాదనలూ ప్రస్తుత రాజకీయ పార్టీలకు ఉపయోగపడే వాదనలే. అయితే లోకమాన్య తిలక్‌ ‌దృష్టి కోణంలో శివాజీని ‘‘గో బ్రాహ్మణ పరిపాలక రాజు’’గా ప్రజలలో ప్రచారం చేసినప్పుడు హిందూ..ముస్లిం రాజకీయం చేసి, సులభంగా మెజారిటీ ఓట్లను పోగు చేసుకోవచ్చు(ఆ పనే శివసేన చేసింది). మహాత్మ జ్యోతి రావు పూలే దృష్టికోణంలోని ‘‘లోకకల్యాణం కోసం పనిచేసిన రాజుగా’’ శివాజిని ఏ రాజకీయ పార్టీ కూడా ప్రచారం చేయలేదు..అందుకు కారణం చాలా సింపుల్‌. ఈ ‌దృష్టి కోణం ప్రచారం చేసినపుడు శివాజీ సాధారణ ప్రజల కోసం చేపట్టిన అపారమైన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఛత్రపతి శివాజీ లాగా ప్రజల సంక్షేమం తలపెట్టినప్పుడు ప్రభుత్వ నిధులు అధికంగా ప్రజల కోసం ఖర్చవుతాయి.

నేటి రాజకీయ పార్టీలు ప్రభుత్వ నిధులు అధికంగా తమ కోసం, తమకు అండగా ఉండే కార్పొరేట్‌ ‌కంపెనీల కోసం ఖర్చు పెడుతున్నాయి. అంచేత మహాత్మ జ్యోతి పూలే దృష్టికోణాన్ని మరుగున పెట్టి లోకమాన్య తిలక్‌ ‌దృష్టికోణాన్ని పెంచి పోషించారు. చత్రపతి శివాజీ గురించి మాట్లాడినప్పుడు ఆయన పెరిగిన వాతావరణం గురించి కూడా చర్చ జరుగుతుంది. ఆయన తల్లి గురించి ఆయన తాత గురించి చరిత్ర వివరాలు నమోదు చేశారు శివాజీ తాత మాళోజి రావు భోసలే. సూఫీ సంత్‌ ‌సహ షరీఫ్‌ని ఆరాధించేవారు. సూఫీ సంత్‌ ‌సహ షరీఫ్‌ ‌గౌరవార్థం తన పిల్లల పేర్లను సహజీ, షరీఫ్‌ ‌జి అని పేరు పెట్టారు. శివాజీని లోకమాన్య తిలక్‌ ‌దృష్టికోణంలో ప్రజల ముందు ప్రచారం చేయాలనుకున్నప్పుడు ప్రధానంగా శివాజీ, అప్జల్‌ ‌ఖాన్‌ ‌మధ్య జరిగిన యుద్ధం ప్రస్తావన చేస్తారు. ఈ యుద్ధానికి సంబంధించిన నిజాల గురించి ప్రస్తావించకుండా ఒక ముస్లిం రాజును చంపిన ఒక హిందువు రాజు కోణం మన ముందు వండి వారుస్తూ ఉంటారు. శివాజీ, అఫ్జల్‌ ‌ఖాన్‌ను ఎలా చంప గలిగారు..? అన్నది ప్రధానమైన విషయం. ఆ విషయాన్ని ఎక్కడ చెప్పరు. చెప్పని ఆ విషయం వివరాలు ఇలా ఉన్నాయి. శివాజీ అఫ్జల్‌ ‌ఖాన్‌ ఇద్దరూ చాలా కాలం యుద్ధం చేస్తారు. ఒకానొక సమయంలో ఇరు రాజులు రాజకీయ సమావేశం నిర్వహించుకొని చర్చలు జరపడానికి నిర్ణయించుకుంటారు. ఈ సమావేశానికి ముందు అఫ్జల్‌ ‌ఖాన్‌ ఒక షరతు పెడతారు. మనం సమావేశం అయ్యేటప్పుడు మనిద్దరి వద్ద ఆయుధాలు లేకుండా సమావేశం అవుదాం అంటారు. ఈ షరతుకు శివాజీ ఒప్పుకుంటారు. ఈ విషయం శివాజీ అంగరక్షకుడు రుస్తామే ఏ జమాల్‌కు తెలుస్తుంది. ఆయన వెంటనే శివాజీతో సమావేశమై అబ్దుల్‌ ‌ఖాన్‌ ‌పెట్టిన షరతుకు మీరు ఎందుకు ఒప్పుకొన్నారు అని శివాజీని నిలదీస్తారు. అఫ్జల్‌ ‌ఖాన్‌ ‌శారీరికంగా బాగా బలిసిన వ్యక్తి, మీ ఇద్దరి మధ్య జరిగే సమావేశంలో మీరిద్దరే ఉంటారు. ఆ సమయంలో అఫ్జల్‌ ‌ఖాన్‌ ‌మీ పైన శారీరక దాడి చేస్తే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చాలా కష్టమవుతుంది. అంచేత ఈ ఒప్పందానికి మీరు ఎలా సరే అన్నారు అని శివాజిని అప్రమత్తం చేసి, ఉపాయంగా శివాజీ చేతివేళ్లకు కనబడకుండా ఉండేలాగా పులి గోళ్ళ ఆకారంలో ఉండే ఇనుప ఆయుధాలు తొడుగుతారు. అఫ్జల్‌ ‌ఖాన్‌, ‌శివాజీ సమావేశంలో రుస్తమే జమాల్‌ ఊహించినట్లుగా శివాజీపై శారీరక దాడి జరుగుతుంది. తన చేతికి ఉన్న పులి గోళ్ళు ఆయుధం ద్వారా అఫ్జల్‌ ‌ఖాన్‌ను శివాజీ అంతం చేస్తారు. ఈ సమయంలో అబ్దుల్‌ ‌ఖాన్‌ అం‌గరక్షకుడుగా పనిచేస్తున్న కృష్ణమూర్తి భాస్కర్‌ ‌కులకర్ణి శివాజీ పైన దాడి చేసేందుకు కత్తి దూస్తారు. సమావేశం బయట ఉన్న రుస్తమే జమాల్‌, ‌కృష్ణమూర్తి భాస్కర్‌ ‌కులకర్ణిపై దాడి చేస్తారు.

ఇంత ముఖ్యమైన విషయం గురించి చరిత్రలో చక్కగా రాసిపెట్టి ఉన్నా కూడా మన ముందు దాని గురించి చర్చించరు. చత్రపతి శివాజీ ఒక రాజు ఇంకొక రాజుకు గౌరవం ఇవ్వాలి అని నమ్మే వ్యక్తి. తన చేతిలో చచ్చిపోయిన అప్జల్‌ ‌ఖాన్‌ ‌సమాధిని, ఛత్రపతి శివాజీ తన ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టి మరి అప్జల్‌ ‌ఖాన్‌ ‌సమాధి కట్టించారు. ఆ సమాధిని విరగ్గొడతామని పలు మార్లు, రైట్‌ ‌వింగ్‌ ‌కార్యకర్తలు దండెత్తారు. శివాజీ మతసామరస్యం ఉన్న రాజు కావటం వలన, భూ, జల సైన్య నియామకాలు మతరహితంగా ఉండేవి. అంచేత శివాజీ సైన్యంలో అత్యధిక ముస్లింలు ఉండేవారు. శివాజీ రాజ్యంలో గూడచారి విభాగానికి అధిపతిగా మౌలానా హైదర్‌ అలీ ఉండేవారు. శివాజీకి నిఘా విభాగానికి సంబంధించి అన్ని విషయాలు ఈయనే ఛత్రపతి శివాజీకి అందించే వారు. శివాజీ ఆయుధ భాండాగారంలో యుద్ధ తోపుల విభాగానికి అధిపతిగా ఇబ్రహీం ఖాన్‌ ‌పనిచేశారు. జల సైన్యానికి అధిపతిగా సిద్ధి సంబల్‌ ఇ‌బ్రహీం పని చేశారు. చత్రపతి శివాజీ ఔరంగజేబుతో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఔరంగజేబు సైన్యాధ్యక్షుడుగా, ఔరంగజేబు సైన్యానికి నేతృత్వం వహిస్తున్న రాజా జైసింగ్‌ ‌రాజ్‌ ‌పుత్‌తో శివాజీ మహరాజ్‌ ‌తలపడ్డారు. ఆగ్రాలో శివాజీ బందీ అయినప్పుడు ఆయనకు సహాయం చేసిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు ముస్లిమ్‌. అతని పేరు మాదారి మోహరత్‌. ‌చత్రపతి శివాజీ మతసామరస్యం ఉన్న రాజు. తన రాజధాని రాయగడ్‌లో భగవాన్‌ ‌జగదీశ్వరుని గుడి పక్కనే ఒక మసీదును కూడా శివాజీ మహరాజ్‌ ‌కట్టించారు. తనను కలవడానికి వచ్చిన ప్రజలలో ముస్లింలు వచ్చినప్పుడు.. వారు ప్రార్థన చేసుకోవడానికి, ప్రార్థనా స్థలం ఉండాలని ఈ ఏర్పాటు ఛత్రపతి చేశారు. శివాజీ హాజరత్‌ ‌బాబా యాకుత్‌ ‌తోరేవాలను ఆరాధించే వారు. ఆయనకు జీవితకాల పెన్షన్‌ ‌మంజూరు చేశారు. రాజుల కాలంలో ప్రభుత్వ ఆదాయం కోసం సొంత గడ్డ పైన పన్నులు విధించేవారు. ఇది కాకుండా సరిహద్దుల ఆవల ఉన్న దేశాలను ఆక్రమించి అక్కడ సంపదను కొల్లగొట్టే వారు. రాజుల కాలంలో ఈ రెండు కార్యక్రమాల వలనే ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది.

తన సైన్యం ఇతర ప్రాంతాలకు దోచుకోవటానికి వెళ్ళినప్పుడు, ఇతర ప్రాంతాల సంపదను కొల్లగొట్టే సమయంలో ఆ ప్రాంత ప్రజల మత నమ్మకాల పుస్తకాలు కనుక దొరికితే వాటిని నాశనం చేయకుండా ఆయా మత ప్రజలకు అందచేయాలి. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న ధార్మిక స్థలాలకు.. సంస్థలకు ఎట్టి నష్టం జరక్కుండా చూడాలని శివాజీ స్పష్టమైన ఆదేశాలు తన సైన్యానికి ఇచ్చారు. సూరత్‌ని ఆక్రమించడానికి శివాజీ సైన్యం వెళ్ళినప్పుడు, సూరత్‌లో ఉన్న ఫాదర్‌ ఎం‌బ్రుస్‌ ‌పింటోకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సైన్యానికి ఆదేశాలిచ్చారు. రాజులకు చాలా మంది భార్యలు వుంటారు అనేది మనకు తెలిసిన విషయమే. చత్రపతి శివాజీ మహారాజ్‌కు కూడా అనేకమంది భార్యలు ఉండేవారు. శివాజీ సైన్యం ఓసారి కళ్యాణి ప్రాంతంపై ఆక్రమణ ప్రకటించి, అక్కడి సంపదతో పాటు కళ్యాణి ప్రాంతం సుబేదార్‌ ‌కోడలును ఎత్తుకొచ్చి, శివాజీ ముందు నిలిపి ఈమెను మీకు బహుమతిగా తెచ్చాము అని చెబితే.. చత్రపతి శివాజీ ముందుగా ఆమెకు క్షమాపణలు కోరుతూ.. ఈమె నాకు మాతృ సమానురాలు. ఈమెను వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించండి, అని సైన్యానికి ఆదేశించారు. ఈ ఘటనపై వీర్‌ ‌సావర్కర్‌ ‌తన అభిప్రాయాన్ని తెలుపుతూ.. చత్రపతి శివాజీ మహారాజ్‌ ‌ప్రతీకారం తీర్చుకునే ఒక మంచి అవకాశాన్ని జారవిడిచారు, అని విమర్శించారు. శివాజీ.. చత్రపతి శివాజీ మహారాజ్‌గా ఆనాటి ప్రజల మన్ననలు పొందటానికి కారణం ఛత్రపతి శివాజి కనబరిచిన మతసామరస్యం. ఈ విషయాలన్నీ మరుగున పెడుతూ..ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ‌ముస్లిం రాజులను వ్యతిరేకించే హిందూ రాజు అన్న దృష్టికోణంతో ఛత్రపతి శివాజీను చూపించటం లేదా ఛత్రపతి శివాజీ కేవలం హిందూ మహా రాజు అని ప్రచారం చేయటం శివాజీ మహారాజ్‌కు చేసే అతిపెద్ద అన్యాయమని చరిత్రకారుడు సర్దేశాయి తన పుస్తకం ‘‘న్యూ హిస్టరీ ఆఫ్‌ ‌మరాఠా’’లో పేర్కొన్నారు. ప్రకృతి..చరిత్ర..స్త్రీ.. ఎంత ఎక్కువ బలాత్కారానికి గురయితే అంతే స్థాయిలో సమాజం నష్టపోతుంది. అందుచేత చరిత్రని వాట్సప్‌ ‌యూనివర్సిటీలో కాక చరిత్రకారులు రాసిన పలు పుస్తకాలలో చదివి భిన్న భిన్న దృష్టికోణాలు తెలుసుకుని మనకు పనికి వచ్చే దృష్టి కోణం అలవరచుకుంటే మంచిది.

Aruna

అరుణ,
జర్నలిస్ట్, ‌న్యూఢిల్లీ

Leave A Reply

Your email address will not be published.