Take a fresh look at your lifestyle.

నూతన సంవత్సర వేడుకలకు అనుమతులు తీసుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల అన్ని రిసార్ట్స్ లకు హెచ్చరించడమేమనగా వారి యొక్క రిసార్ట్ లలో నూతన సంవత్సరం సందర్భంగా ఏవైనా ఈవెంట్స్ గాని వేడుకలు గాని ముందస్తు అనుమతులు లేకుండా నిర్వహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా నిర్వాహకులు ఈ క్రింది సూచనలు తప్పనిసరిగా పాటించాలని వికారాబాద్ పట్టణ సిఐ టంగుటూరి శ్రీనివాస్ తెలిపారు. రిసార్ట్స్ లలో డ్రగ్స్ (మత్తు పదార్థాలు) గాని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడరాదు అని అన్నారు. న్యూ ఇయర్ వేడుకలు అర్ధరాత్రి ఒంటిగంట వరకు ముగించాలి. 45 డిసబుల్స్ శబ్దం కంటే ఎక్కువ శబ్దం ఉండొద్దు అని పేర్కొన్నారు.   అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు అని పేర్కొన్నారు.  ప్రతి ఈవెంట్లలో సీసీ కెమెరాలు మరియు సెక్యూరిటీ తప్పనిసరి అని అన్నారు. లిక్కర్ ఈవెంట్లలో మైనర్లకు అనుమతి లేదు, డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు ఉంటాయి అని పేర్కొన్నారు. కెపాసిటీకి మించి పాసులు ఇవ్వరాదు, సాధారణ పౌరులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించరాదు అని అన్నారు.  డ్రంకన్ డ్రైవ్ లో పాల్పడితే రూపాయలు పదివేల జరిమానా తోపాటు ఆరు నెలల జైలు శిక్ష మరియు లైసెన్సులు రద్దు చేయబడును అని అన్నారు.

రిసార్ట్ లలో తనిఖీల నిమిత్తం ఈ చివరి మూడు రోజులు పోలీసు బృందాలచే ప్రతి రిసార్ట్ లను తనిఖీ చేయబడును. ప్రతి రిసార్ట్ కు ముందుగానే నోటీసులు జారీ చేయడం జరిగినది అని అన్నారు.
ఎవరైనా రిసార్ట్ యజమానులు / మేనేజర్లు పోలీసులు సూచించిన నియమ నిబంధనలు పాటించనిచో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొనబడునని వికారాబాద్ ఇన్స్పెక్టర్ టంగుటూరి శ్రీను హెచ్చరికలు జారీ చేసినారు.

Leave a Reply