Take a fresh look at your lifestyle.

మహేశ్వరం పాకిస్తాన్ లో ఉందా? రజాకార్ల

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 9:  బీఆర్ఎస్ సర్కార్ ను బొంద పెడదాం రామరాజ్యం స్థాపించుకుందాంపొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే బొట్టుపెట్టుకుని,కంకణం కట్టుకునే పరిస్థితి ఉండదు వలస పక్షులను తరిమికొట్టండిబీజేపీని గెలిపిస్తే ఉచిత విద్య,వైద్యం, పేదలకు ఇండ్లు బిఆర్ఎస్,కాంగ్రెస్,ఎంఐఎంలపై బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు.‘మహేశ్వరం పాకిస్తాన్ లో ఉందనుకుంటున్నరా? లేక రజాకార్ల రాజ్యమనుకుంటున్నరా?ఎంఐఎం అరాచాకాలు శ్రుతి మించినా ఎందుకు నోరు మెదపడం లేదని,గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకుంటే కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.ఛత్రపతి శివాజీ వేడుకలు చేసుకుంటే పోలీసులతో బెదిరిస్తా రాని ఇక్కడ కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లను పాతబస్తీలోని ఎంఐఎం కార్యకర్తలకు పంచిపెడతార ఇదేం పాలన అంటు మండి పడ్డారు.పొరపాటున మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే బొట్టు పెట్టుకుని, కంకణం కట్టుకుని తిరిగే పరిస్థితి కూడా ఉండదు’’ అంటూ బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి,స్టార్ క్యాంపెయినర్ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్కార్ ను బొందపెట్టి బిజెపి ఆధ్వర్యంలో రామరాజ్యాన్ని స్థాపించుకుందామని పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గ బిజెపి అభ్యర్ధిగా అందెల శ్రీరాములు యాదవ్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా వేలాది మందితో అట్టహాసంగా జరిగిన ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు.ర్యాలీలో ప్రసంగించాలని భావించినప్పటికీ హెలికాప్టర్ లో ఖానాపూర్ వెళ్లాల్సి రావడం,సమయం మించిపోవడంతో మాట్లాడలేకపోయారు. ఈ నేపథ్యంలో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు ఏం పాపం చేసుకున్నరో అర్ధం కావడం లేదని,ఈ నియోజకవర్గంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్స్ స్థానికులకు ఇవ్వకుండా పాతబస్తీకి చెందిన ఎం ఐ ఎం కార్యకర్తలకు,ఓ వర్గానికి ఇస్తున్నరని,ఫార్మా సిటీ కోసం ఇదే నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో 19వేల ఎకరాలు తీసుకున్నారని ప్యాబ్ సిటి పేరుతో రైతుల నుండి పెద్ధ ఎత్తున భూమలు లాక్కుని తీసుకున్నరు అని ప్రకటనలో తెలిపారు.  పనిచేయాల్సిన ప్రభుత్వం బ్రోకర్ పాత్రను పోషించడం బాధాకరం.ఈ జిల్లా మంత్రి భూకబ్జాలకు,అవినీతి,అక్రమాలకు అంతులేదని,ధరణి పేరుతో ఆమె తనయుడు భూకబ్జాలకు పాల్పడుతున్నాడని,ఇప్పుడు ఎలక్షన్లలో గెలవాలని అన్ని అడ్డదారులు తొక్కుతున్నారని రోజుకు 70 నుంచి 100 శిలాఫలకాలు వేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నరే తప్ప చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. లాక్కుని కట్టిన గ్రంథాలయానికి మంత్రి భర్త పేరు పెట్టుకోవడం సిగ్గు చేటన్నారు.అభివృద్ధి పేరుతో దళితుల,పేదల భూములను లాక్కోవడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు.ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి ఓ డమ్మీ అని మేడ్చల్ నుండి వలస వచ్చి పోటీ చేస్తున్నడని ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.బిఆర్ఎస్,కాంగ్రెస్ నేతలిద్దరూ కాంగ్రెస్ నుండి వచ్చిన వలసపక్షులేనన్నారు.మీకు అండగా ఉంటూ బిఆర్ఎస్ అరాచకాలపై,ప్రజా సమస్యలపై పోరాడుతున్న శ్రీరాములు యాదవ్ ను గెలిపించుకొవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టి రథసారధి బొక్క నరసింహా రెడ్డి,ఆయా మండలాల నేతలు పాల్గొన్నారు.

Leave a Reply