Take a fresh look at your lifestyle.

గీతమ్ లో ప్రమాణ సెక్రటేరియట్ ప్రారంభం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 26: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ మంగళవారం ప్రమాణ- 2024 సచివాలయాలన్ని కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ రామశాస్త్రి వేదాల ప్రారంభించారు. గీతమ్లో ప్రతియేటా సాంకేతిక- సాహిత్య-నిర్వహణల మేలు కలయికగా నిర్వహించే మూడు రోజుల పండుగకు సన్నాహకంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక శిక్షణ, ఉపన్యాసాలు, పోటీలతో పాటు ర్యాంప్ వాక్, సింఫోనీ, కన్సర్ట్, బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్, కార్నివాల్, పలు యాజమాన్య మెళకువలను నేర్పే పోటీల సమాహారంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
ప్రమాణ కార్యాలయాన్ని ఆరంభించిన సందర్భంగా ప్రొఫెసర్ రానుశాస్త్రి మాట్లాడుతూ, నూతన సాంకేతికత మేళవింపుతో కార్యక్రమాలను ఎంపికచేసి, ఇతర కళాశాలల విద్యార్థులు విరివిగా పాల్గొనేలా వాటిని రూపొందించమని సూచించారు. రోబోటిక్స్, ఈ-యంత్ర, హ్యాకథాన్, డిజెన్ పోటీలతో పాటు ఇతరత్రా కార్యక్రమాలను అత్యాధునిక సాంకేతికతతో ఉండేలా చూడాలన్నారు. ప్రచారం విద్యార్థులను ఆకర్షిస్తుందని, ఎక్కువ నుంది పాల్గొంటేనే మన ఉత్సవ ప్రతిష్ఠ ఇనుమడిస్తుందని చెప్పారు. కార్యక్రమాల కూర్పు అనంతరం వెబ్సైట్లో అన్ని వివరాలను పొందుపరచి, ఇతర కళాశాలల విద్యార్థులకు ఆ సమాచారం చేరేలా చూడాలని సలహా ఇచ్చారు.గీతం, హైదరాబాద్ లో ఉన్న ఏడు స్కూళ్ళ (టెక్నాలజీ, మేనేజ్మెంట్, సెన్ట్స్, ఫార్మశీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్, పబ్లిక్ పాలసీ) విద్యార్థులందరూ పాల్గొనేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ కరుణాకర్.బి సూచించారు.గత ఉత్సవాల కంటే ఈ ఏడాది ప్రమాణ-2024 మేటిగా ఉండేలా తీర్చిదిద్దమని ప్రమాణ నిర్వాహకుడు డాక్టర్ సి.త్రినాథరావులు సూచించారు.గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, వివిధ విభాగాధిపతులు, పలువురు విద్యార్థులు ప్రమాణ-2024 కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గీతం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తికి ఈ సందర్భంగా నివాళులర్పించారు.

Leave a Reply