Take a fresh look at your lifestyle.

బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ గంగు భాను మూర్తి కన్నుమూత

తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు  గంగు భానుమూర్తి   ఆదివారం హైదరాబాదులో అనారోగ్యంతో కన్నుమూసారు.
తెలంగాణ ఉద్యమంలో  దేవాదాయ శాఖలో   పనిచేస్తున్న  అర్చకులు అందరిని  ఏకం చేసి  అనేక రాష్ట్ర సాధన ఉద్యమాలకి  నాయకత్వం వహించిన నాయకుడు గంగు భాను మూర్తి. కేంద్ర ప్రభుత్వం  అనుసరిస్తున్న  విధానాలకు నిరసనగా  కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు  తెలంగాణలోని  అన్ని దేవాలయాలు మూసివేసి   నిరసన తెలిపి  ఉద్యమంలో  కీలక పాత్ర
పోషించారు.అర్చకుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసిన నాయకుడు ..  ముఖ్యమంత్రి కెసిఆర్  భారతదేశంలోనే తొలిసారిగా అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ప్రకటించడంలో గంగు భానుమూర్తి కృషి మరువలేనిది   అని దేవి ప్రసాద్, మాజీ చైర్మన్ బేవరేజెస్ కార్పొరేషన్  ప్రగాఢ సంతాపం తెలిపారు.

Leave a Reply