Take a fresh look at your lifestyle.

మాట తప్పిన కాంగ్రెస్‌ను బొంద పెట్టాలి

కరెంటు నాటి లెక్క ఎందుకు రావడం లేదు..
కరెంటు లేక కాదు, నీళ్లు లేక కాదు..నిర్వహణ లోపమే..
మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు

మెదక్‌, ప్రజాతంత్ర, మార్చి 31 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌ ను బొందపెట్టాలని  మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు ధ్వజమెత్తారు. మెదక్‌ అసెంబ్లీ నియోజక వర్గంలోని నిజాంపేటలో ఆదివా రం జరిగిన మండల కార్యకర్తల సమావేశంలో హరీశ్‌ రావు మాట్లాడారు. వ్యవసాయాన్ని  ఆగం చేశారని, వడ్లకు బోనస్‌ ఇవ్వని కాంగ్రెస్‌ ను నిలదీయా లన్నారు.  నిజాంపేట కాలువకు నీళ్లు ఎందుకు వొస్తా లేవో అడగాలని, కరెంటు నాటి లెక్క ఎందుకు రావడం లేదు.. కరెంటు లేక కాదు, నీళ్లు లేక కాదు.. నిర్వహణ లోపమే ఇందుకు కారణమని ఆరోపించారు.  6 గ్యారంటీలు ఏమయ్యా యి.. సోనియా గాంధీతో ప్రకటిం చిన 6 గ్యారంటీలు అటకెక్కిం చారన్నారు. 100 రోజులు దాటిపోయాయి.. మహాలక్ష్మి కింద మహిళలకు రూ.2500 ఆర్థికసాయం , వృద్ధులకు 4 వేల పించిన్‌ ఇవ్వలేదన్నారు.  రేవంత్‌ రెడ్డి ఉన్న జిల్లాలను సివేస్తారటా..ఊరుకుందామా, మెదక్‌ జిల్లా, రామయంపేట డివిజన్‌, నిజాంపేట మండలం పోవలా అని ప్రశ్నించారు.  మెదక్‌ లో ఓటమి అయినప్పటికీ నిజాంపేట అండగా నిలిచిందని, వెంకట్రామారెడ్డి  మనసున్న వ్యక్తి అని అన్నారు. 100 కోట్ల ట్రస్టు ఏర్పాటు చేస్తున్నారని, మీ అందరికీ ఉపయోగ కరంగా ఉంటుందని తెలిపారు.

నడిచే ఎద్దు అయితే అక్కడే నడిచేదని,  దుబ్బాకలో మోసం చేస్తే..రఘునందన్‌ ను బండ కేసి కొట్టారని, బీజేపీ మనకు ఒక్క మంచి పని చేసిందా అని, నల్ల ధనం తెచ్చి పేదలకు పంచుతామన్నారు. దేశ వ్యాప్తంగా మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తే.. తెలంగాణ కు ఒక్కటైనా ఇచ్చారా బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ లేదు..కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ లేదని మండిపడ్డారు. మన బీఆర్‌ఎస్‌ ను మనం రక్షించుకుందామని, మెదక్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్‌, ఎమ్మెల్సీ పి వెంకట్రామారెడ్డి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వెంకట్రామారెడ్డి  మాట్లాడుతూ..  తనను ఆశీర్వదిస్తే..  దిల్లీలో ప్రశ్నించే గొంతునవుతానన్నారు. ఇక్కడ డబుల్‌ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వడం జరిగిందని, కలెక్టర్‌ గా మంచి పేరు సంపాదించుకున్నానని, ప్రజాసేవ కోసం  తనను ఆశీర్వదించాలని కోరారు. రూ.100 కోట్ల తో విద్యానిధి ఏర్పాటు చేసి పేదలకు ఆదుకుంటానని హామీ ఇచ్చారు.  7 నియోజకవర్గాలలో  ఫంక్షన్‌ హాళ్లు నిర్మిస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. మాట తప్పిన కాంగ్రెస్‌, బీజేపీ లను ఓడిరచాలని కోరారు. కేసీఆర్‌ మాట మీద నిలబడే వ్యక్తి అని  దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమం సాధించారని తెలిపారు.  వెంకట్రామిరెడ్డి గారిని గెలిపించి ఓటమికి ప్రతీకారం తీర్చుకుందామని పిలుపునిచ్చారు.

  బీఆర్‌ ఎస్‌ కు  ద్రోహం చేసినవాళ్లను తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదు.
కాంగ్రెస్‌ కు వోటు  వేస్తే మోసపోతాం
రూ.2 లక్షల రుణమాఫీ, 4,000 పెన్షన్‌, తులం బంగారం ఏమైంది..
బీజీపీ  రైతులకు  గిరిజనులకు చేసిందేమీ లేదు.
తెలంగాణ ఉద్యమంలో కామారెడ్డికి కీలక పాత్ర
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు
  

బీఆర్‌ ఎస్‌ ద్వారా పదువులు పొంది ద్రోహం చేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదని  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిష్‌ రావు అన్నారు. రానే రాదన్న తెలంగాణను కేసీఆర్‌ సాధించి పెట్టారని, కేసీఆర్‌ లేని తెలంగాణను ఊహించలేమని తెలిపారు. కేసీఆర్‌ చెంత ఉన్న నాయకులను కాంగ్రెస్‌ ఇదివరకు కూడా తీసుకెళ్లిందని, కాంగ్రెస్‌ కొందరు  నాయకులను కొంటుందేమో గానీ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కొనలేదని స్పష్టం చేశారు. పార్టీ ద్వారా పదవులు పొంది ద్రోహం చేసినవాళ్లను తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. కామారెడ్డి కి ఒక ప్రత్యేకత ఉంది. తొలి నాళ్లలో నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ ను గెలిపించి, తెలంగాణ ఉద్యమానికి జీవం పోసిన ప్రాంతం ఈ కామారెడ్డి నియోజకవర్గమని అన్నారు. అదే పోరాట స్ఫూర్తితో   బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గాలి అనిల్‌ కుమార్‌  ని  గెలిపించాలని కోరారు.

యాసంగి వడ్లకు 500 బోనస్‌ ఇస్తామని కాంగ్రెస్‌ బాండు పేపర్లు ఇచ్చిందని,  ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.  కారుకు ఓటేసి వాళ్లకు గుణపాఠం నేర్పాలన్నారు.  100 రోజుల పాలనకు ఈ ఎన్నిక రెఫరెండం అంటున్నారు. కాంగ్రెస్‌ కు ఓటు వేస్తే మోసపోతాం.. రూ. 2 లక్షల  రుణమాఫీ, 4,000 పెన్షన్‌, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించారని  అంటారు. కాబట్టి, కాంగ్రెస్‌ పార్టీని ఓడిరచాలి..  దీనిపై ప్రతి గ్రామంలో చర్చ జరగాలి అని హరీష్‌ రావు కోరారు. అవ్వా, తాతలకు, వికలాంగులకు, బీడీ, గీత కార్మికులకు.. ఇతర పింఛనుదారులకు 4 వేల పింఛన్‌ ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ మోసం చేసిందని,  వాళ్లందరికీ ఈ విషయం వివరించాలన్నారు. ఇప్పుడు వడ్లు వస్తున్నా రైతుబంధు రూ. 15వేలు ఇంకా ఇవ్వలేదు. పదివేలు కూడా రాలేదు. 15 వేల రైతుబంధు వచ్చినోళ్లు కాంగ్రెస్‌కు, రాని వాళ్లకు బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. కామారెడ్డి కార్యకర్తలకు ఇది పరీక్ష అని, తన  ఎన్నిక కోసం మీరు ఎంత కష్టపడ్డారో గాలి అనిల్‌ కుమార్‌ గెలుపు కోసం కూడా అంతే కష్టపడాలని కోరారు.  తనకు కొచ్చినంత మెజారిటీతో ఆయనను గెలిపించాలన్నారు. .
కామారెడ్డి అభివృద్ధిని అడ్డుకున్నవారు  ఈ రోజు ఇక్కడికొచ్చి సిగ్గులేకుండా ఓట్లు అడుగుతున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా అమలు చేయని కాంగ్రెస్‌కు ఎంపీ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదన్నారు.

కేసీఆర్‌ మాట తప్పని మనిషి. కల్యాణలక్ష్మి, పింఛన్లు.. ఏ హామీ విషయంలోనూ మాట తప్పలేదు. యాసంగి వడ్లకు, మక్కలకు 500 బోనస్‌ ఇస్తా అన్న మాటను నిలబెట్టుకోవాలి. కారుకు ఓటేసి వాళ్లకు గుణపాఠం నేర్పాలి. ప్రతి నెల రూ 2,500. డిసెంబర్‌ నెల నుంచి ఇస్తా అన్న హామీ నిబెట్టుకోవాలి. కరోనా సమయంలో కూడా రైతు బంధు ఆగలేదు. వాళ్లు ఎకరాకు ఇస్తా అన్న 15 వేలు కాదు కదా.. 10 వేలు కూడా కోతలకు దగ్గర వచ్చిన వారి సరిగా ఇవ్వలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాతపెట్టాలి. అప్పుడే వాళ్లకు తాము మోసం చేశామని తెలుస్తుంది. అని హరీశ్‌ రావు అన్నారు.
తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని, ఎన్నికలు దగ్గర వచ్చినయి కాబట్టి పెట్రోల్‌, డీజిల్‌ మీద 2 రూపాయలు తగ్గించారని మండిపడ్డారు.  కేసీఆర్‌ కన్నా యజ్ఞ యాగాలు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు లేరనన్నారు.  బీజీపీ దేశంలో రైతుల కోసం, గిరిజనుల కోసం చేసిందేమీ లేదని, తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్‌ రెడ్డిదని ధ్వజమెత్తారు.  తెలంగాణ రాష్ట్రం తరపున ప్రశ్నించే గొంతుకగా, ఆత్మగౌరవ ప్రతీక అయిన బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని హరీష్‌ రావు తెలిపారు.

Leave a Reply