Take a fresh look at your lifestyle.

హుస్నాబాద్ లో పర్యటించిన జిల్లా ఎన్నికల అధికారి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో పర్యటించారు. ముందుగా హుస్నాబాద్ సమీకృత కార్యలయాల సముదాయం ఇటీవలే ప్రారంభం అయ్యింది కావున ఆర్డీఓ బెన్ షాలం, తహసీల్దార్ రవిందర్ రెడ్డి కలెక్టర్ కు బోకె ఇస్తు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఐఓసీ లోకి అన్ని శాఖలు మారడానికి కొంత సమయం పడుతుందని ఆర్డిఓ కలెక్టర్ కి తెలిపారు. కార్యాలయం మొత్తం కలియ తిరిగారు. వాటర్ సౌకర్యం, ఎలక్ర్టిసిటి, ఇంటర్నెట్ సౌకర్యం గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రిక్ కనెక్షన్లో అక్కడక్కడ వైర్లు కనిపించకుండా చుసుకోవాలి. రికార్డులు, పైల్ లు కింద పెట్టకుండా ర్యాక్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసిన ఎలక్షన్ సెల్, ఎంసిసి రిపోర్టింగ్ సెల్ కంప్యూటర్ లో ఓటర్ల వివరాలను స్వయంగా చుశారు. ఆర్ ఓ చాంబర్ లో అధికారులకు ఎన్నికల ప్రక్రియ గూర్చి వివరించారు. కంట్రోల్ రూమ్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, ఎక్స్పెండిచర్ అకౌంటింగ్ టీం,  వీడియో వ్యీవింగ్ టీం, స్వీప్  “ఐ ఓట్ పర్ ష్యుర్ మాడల్” లొ పాల్గొని పోటో దిగారు. రి  చెక్ యువర్ ఓట్ క్యూఆర్ కోడ్ లో స్వయంగా పోన్ ద్యారా స్కాన్ చేసి యాప్ అందించే వివరాలను తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడారు. సిబ్బందికి వారికి కేటాయించిన  విధుల గూర్చి పూర్తిగా అవగాహన ఉండాలి పనుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తతో పనిచేయాలని సూచించారు. ఐఓసీలో  వ్యవసాయ  ఎడిఎ మరియు ఆర్ అండ్ బి డిఈ చాంబర్లు ఇంకను ఐఓసీకి ఎందుకు రాలేదని ఆయా శాఖల అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరగా శాఖలను ఐఓసి కు షిఫ్ట్ చేయాలని ఆదేశించారు.అనంతరం తెలంగాణ మోడల్ స్కూల్ లో ఎలక్షన్ స్ట్రాంగ్ రూమ్ మరియు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను పరిశీలించారు. ఎలక్షన్ మిషన్ లు బద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ లోపల ఎలక్ట్రిసిటీ కనెక్షన్ పకడ్బందీగా చేయ్యాలన్నారు. మైదానంలో ముల్లపోదలు, రాళ్ళు రప్పలు, మొరం మొత్తం చదును చెయ్యాలని మునిసిపల్ అదికారులకీ తెలిపారు. సిసి టీవీ ఫుటేజ్ టీవీలను హార్డ్ డిస్క్ స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ మొత్తంలో డాటా భద్రపరిచే విధంగా తీసుకోవాలని సూచించారు. కమిషననింగ్ గది, రిజర్వ్ స్ట్రాంగ్ రూమ్, పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్, మెటీరియల్ రూమ్ లను పరిశీలించారు. టాయిలెట్స్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు పవర్ సప్లై ఈవీఎంలు రాగానే ఎలాంటి ఆటంకాలు రాకుండా జనరేటర్ అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు తెలియజేశారు. పోలీస్  అధికారులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Leave a Reply