Take a fresh look at your lifestyle.

‌ప్రజలపై పన్నుల భారం ..కేంద్రం మౌన రాగం…

దేశంలో అన్ని వస్తువుల,సేవల ధరలూ పెరిగిపోతూ వుంటే, దాని ప్రభావాన్ని తట్టుకుని భరించే స్థితిలో సామాన్య ప్రజలు లేరు. ప్రభుత్వాలు తాము పెంచుతున్న ధరలు కావచ్చు..జిఎస్టీ కావచ్చు..గ్యాస్‌ ‌కావచ్చు సామాన్యులకు భారం పడదన్న ధోరణిలో ఉన్నారు. నిజానికి ఏ వస్తువు అయినా ధరలు వెచ్చించి సామా న్యులు కొనాల్సిందే. ఏకీకృత పన్ను విధానం పేరుతో తీసుకుని వచ్చిన జిఎస్టీ ఇప్పుడు సామాన్యులకు గుదిబండగా మారింది. పాన్‌, ఆధార్‌ ‌లింక్‌ ‌కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారనుంది. దీనికితోడు కనీసం వేయి రూపాయల ఛార్జీ వడ్డిస్తున్నారు. వారి ఆదాయాలు పెరగకుండా ధరల పెరుగుదల ను భరించే స్థితిలో ప్రజలు ఉన్నారా లేరా..అన్నది కూడా పాలకులు ఆలోచన చేయడం లేదు. శ్రామిక వర్గ ఆదాయాలు పెరిగే ధరలకు అనుగుణంగా పెరగగకుంటే  ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. శ్రామిక ప్రజల ఆదాయాలు పెరగవని తెలుసు. పెరగడం లేదని కూడా తెలుసు.  భారమంతా శ్రామిక వర్గమే అంతిమంగా భరించాల్సి వస్తుందని కూడా పాలకులు తెలుసు. తెలిసి కూడా పెట్రో,గ్యాస్‌, ‌జిఎస్టీ ధరల పెరుగుదలకు అడ్డూఅదుపు లేకుండా చేస్తున్నారు. ఇక సామాన్యుల ఇంటికలను ఛిద్రం చేసేసారు.

సామాన్యులు సొంతంగా ఇల్లు కట్టుకొనే• పరిస్థితి లేదు. మరోపక్క పేదవారి పట్ల పార్టీలు వేరైనా పాలకులంతా మొసలి కన్నీరు కారుస్తోంది. అంతర్జాతీయ చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ, దేశీయంగా పెట్రో ధరలను పెంచి తీరాలన్న సూత్రం ఏదీ లేదు.  కానీ అలా పెంచడం వల్ల ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. పెట్రోల్‌ అన్నది ఇప్పుడు కేంద్రానికి ఆదాయవనరుగా మారింది. పెట్రో ధరల పెంపు అనేది ప్రభుత్వం అనుసరించే ద్రవ్య వ్యూహం బట్టి ఉంటుంది. ఈ ద్రవ్య వ్యూహాన్ని ప్రభుత్వం ఎప్పటి కప్పుడు మార్చుకునే వీలున్నా అందుకు కేంద్రం సిద్దంగా లేదు. పెట్రో ధరలను తమకు ఇష్టం లేకున్నా పెంచవలసి వస్తోందని వాపోవడం దొంగనాటకం కాక మరోటికాదు. పెట్రో ఉత్పత్తుల ధరలో దాదాపు సగం భాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులకే పోతుంది. ఈ పన్నులకి, అంతర్జాతీయ చమురు ధరలకి సంబంధం లేదు. అయినా ఆ పన్నులను పెంచుకుంటూ పోతోంది. తన వంతు అదనంగా ప్రజల ద కేంద్రంలోని మోదీ  ప్రభుత్వం  భారాన్ని మోపుతూనే పోతోంది. రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని కొంత వరకూ అర్ధం చేసుకోవచ్చు. వాటి పరిధిలో పరిమితమైన ఆదాయ వనరులే ఉన్నాయి. ముఖ్యంగా జి.ఎస్‌.‌టి విధానం వచ్చాక రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలు బాగా తగ్గిపోయాయి. పెట్రో ఉత్పత్తులు జిఎస్‌టి పరిధి లోకి రావు. అందుకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు పెట్రో ఉత్పత్తుల ద పన్నులు వసూలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యక్ష పన్నులు విధించే అధికారం లేనందువలన వాటికి వేరే దారి లేదు. కాని కేంద్ర ప్రభుత్వం వేరు. వేర్వేరు మార్గాల్లో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలు  పుష్కలంగా ఉన్నాయి. కాని కావాలనే అది ఆ మార్గాలను ఉపయోగించడంలేదు. సంపన్నులద ప్రత్యక్ష పన్నులు విధించవచ్చు. ఆ సంపన్నుల పట్ల పక్షపాత వైఖరితో ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రత్యామ్నాయాన్ని అది ఆలోచించడం లేదు. సంపన్న వర్గాలే పెట్రో ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిస్తాయి గనుక పెట్రో ఉత్పత్తుల ద ధరలు పెరిగితే వారిదే భారం ఎక్కువగా పడుతుందని ఎవరైనా భావిస్తే అది చాలా పొరపాటు. పెట్రో ఉత్పత్తులలో సామాన్య ప్రజలు నేరుగానే వినియోగిస్తారు. ఇందుకు ఉదాహరణ వంట గ్యాస్‌. ఇక పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగితే రవాణా చార్జీలు అనివార్యంగా పెరుగుతుంటాయి. దానితోబాటు వినిమయ వస్తువుల ధరలన్నీ పెరుగు తాయి. వాటిలో ఆహార ధాన్యాలతో సహా చాలా వస్తువులను ప్రజలే ఎక్కువగా వినియోగిస్తారు.

ఇక సంపన్నులు పెట్రో ఉత్పత్తులను వినియోగించి ఉత్పత్తి చేసే వివిధ రకాల సరుకుల రేట్లను పెంచి అమ్ముతారు. ఆ విధంగా కూడా అంతిమంగా వినియోగదారుల పైనే భారం అంతా పడుతుంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పుడు పెట్రో ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించు కోవడం కూడా అవసరమే. పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచితే అప్పుడు వాటి వినియోగం తగ్గుతుంది. పెట్రో ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలని సామాన్య ప్రజలు మాత్రమే కోరుకుంటారు. ఎందుకంటే వారే నేరుగా బాధ్యలు కనుక. వినిమయం తగ్గితే  మార్కెట్‌లో మాంద్యం మరింత పెరుగుతుంది. అది మరింత ఎక్కువగా నిరుద్యోగానికి దారి తీస్తుంది. ఆ విధంగా ఒక వైపు ద్రవ్యోల్బణం, మరోవైపు మాంద్యం ఆర్థికంగా దెబ్బ తీస్తుంది. ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల పంపిణీని నియంత్రించి రేషనింగ్‌ ‌విధానాన్ని అమలు చేయడం ద్వార కొంత కంట్రోల్‌ ‌చేయవచ్చు. నిజాయితీ ఉంటే ప్రత్యామ్నాయ ద్రవ్య విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడాలి. అదికూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించాలి. అప్పుడే ప్రజలపై భారం పడదు. నిజానికి ప్రజల నుంచి డబ్బులు గుంజడమెలా అన్నది కేంద్రం చేస్తున్న ఆలోచన.. జిఎస్టీతో ప్రజలు అల్లాడుతున్నా..పన్నులు కట్టలేక చస్తున్నా..పెట్రోల్‌ ‌ధరలతో దాడులు చేస్తున్నా.. పట్టించు కోని ప్రధాని మోదీ  రాష్టాల్రు వ్యాట్‌ ‌తగ్గించాలని గతంలో చేసిన సూచనలు ప్రజలంతా గమనిస్తున్నారు. మోదీ• వచ్చాక వివిధ రూపాల్లో జిఎస్టీ వసూళ్లు లక్షల కోట్లలో పెంచుకుంటున్నారు. కానీ ప్రజలపై పడుతున్న భారాలపై మాట్లాడడం లేదు. ఈ రోజు వరకు పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ద ఒక పైస కూడా టాక్స్ ‌పెంచలేదని సిఎం కెసిఆర్‌ ఇప్పటికే కుండబద్దలు కొట్టారు. నిజానికి మోదీ  రాష్టాల్రను విశ్వాసంలోకి తీసుకుని ఏ అంశం పైనా చర్చించడం లేదు. నిజానికి విజన్‌ ఉన్న ప్రధానిగా..అంతా బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రధానిగా దేశానికి ఒరిగిందేమిటన్న ఆలోచనచేయడం లేదు. ప్రజలను విస్మరించి చేస్తున్న పాలన కారణంగా ప్రజలు నానా యాతన పడుతున్నారు. ప్రజలు ఈ అంశాలపై చర్చించాలి. పాలకుల నిజ స్వరూపాన్ని నిగ్గదీయాలి. అప్పుడే పాలకులు దారికొస్తారు.
– ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply