Take a fresh look at your lifestyle.

‌ప్రపంచానికి మరోమారు కొరోనా సవాళ్లు

  • చైనాలో పెరుగుతున్న కేసులతో భారత్‌ అ‌ప్రమత్తం
  • ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 21 : ‌చైనాలో కొరోనా విలయం ప్రపంచానికి మరోమారు సవాల్‌ ‌విసిరేలా ఉంది. జీరో కోవిడ్‌పాలసీ ఎత్తేశాక వైరస్‌ ‌కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరణాలూ పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నా.. ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడంలేదు. మరణాలను పట్టించుకోవడం లేదు. అలాగే మరణాలను ప్రపంచానికి తెలియనివ్వడం లేదు. చైనా సహా పలు దేశాల్లో కోవిడ్‌ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ అ‌ప్రమత్తమైంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసులకు సంబంధించి ప్రతిరోజూ జీనోమ్‌ ‌సీక్వెన్సింగ్‌ ‌పరీక్షలకు ఇన్సాకాగ్‌ ‌ల్యాబ్‌లకు నమూనాలను పంపాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ ‌భూషణ్‌ ‌రాష్టాల్రకు లేఖ రాశారు. చైనా సహా.. జపాన్‌, అమెరికా, కొరియా, బ్రెజిల్‌లో కేసుల సంఖ్య పెరుగుతోందని.. ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షల కేసులు పెరుగుతున్నాయని ఆ లేఖల్లో గుర్తుచేశారు.

అటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి మన్‌సుఖ్‌ ‌మాండవీయ ఈ అంశంపై ఉన్నతస్థాయి సక్ష నిర్వహించనున్నారు. చైనాలో ఇప్పటికే ఆస్పత్రులు, బెడ్స్ ‌ఫుల్‌ అయ్యాయి. బెడ్స్ ‌ఖాళీలేక డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డుల్లో ఒక్కో బెడ్‌పై ఇద్దరిని, బెడ్స్ ‌మధ్య నేలపైన రోగులను పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. అంత్యక్రియల కోసం బీజింగ్‌లో ఒక్క క్రిమటోరియానికే రోజుకు 200 మృతదేహాలను తీసుకొస్తున్నారని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు కరోనా పూర్తిగా అంతం కాలేదని కొత్త వేరియంట్‌లు వస్తున్నాయని గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక చేసింది.అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యసంస్థ కూడా హెచ్చరించింది. కరోనాతో జాగ్రత్తగా ఉండాల్సిందేనని కేంద్రకార్యదర్శి రాజేశ్‌ ‌భూషణ్‌ ‌చేసిన హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇకపోతే రాబోయే రోజుల్లో చైనాలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరించారు.

దేశ జనాభాలోని 60శాతం మందికి రాబోయే 3  నెలల్లో కరోనా సోకుతుందని చైనాలో ఆందోళన వ్యక్తం అవుతోంది.వైరస్‌ ‌మరణాలు కూడా లక్షల్లోకి పెరుగుతాయంటున్నారు. జీరో కొవిడ్‌ ఆం‌క్షలు ఎత్తేశాక దేశంలో వైరస్‌ ‌కేసులు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నా జిన్‌ ‌పింగ్‌ ‌సర్కారు పట్టించుకోవట్లేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం గంటల వ్యవధిలోనే రెట్టింపు కేసులు నమోదు అవుతున్నాయని అంటున్నారు. కరోనాతో చనిపోయిన వాళ్ల సంఖ్యను ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోందని ఆరోపిస్తున్నారు.  ఒక్క బీజింగ్‌ ‌లోనే రోజూ వందలాది మంది వైరస్‌తో చనిపోతున్నారని తెలిపారు. చైనా కేంద్రంగా కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రపంచానికీ ముప్పు తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply