Take a fresh look at your lifestyle.

ఎం‌త ఎదిగినా.. ఇంకా వివక్షే..!

“నేడు మహిళాలోకం స్ఫూర్తిదాయకంగా ఎదుగుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ పురుషాధిక్య సమాజంలో ఆడవారు ఇంకా అవస్తలు పడుతూనే ఉన్నారు. ఆడవారు అర్ధరాత్రి ఎలాంటి భయం లేకుండా తిరగగలిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్య్రం, దేశాభివృద్ధిని ఆ దేశంలోని మహిళల పరిస్థితిని గమనించి తెలుసుకోవచ్చునని పెద్దల కలలు, ఆశయాలు నేటికీ అలాగే ఉండిపోయాయి.ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు మనసును కలచి వేస్తున్నాయి. ఇప్పటికీ మహిళలు ధైర్యంగా రాత్రిపూట బయటికి ఒంటరిగా వెళ్ళలేరు. నేటికీ వివిధ రంగాలలో మహిళలు వెనకబడి ఉన్నారు.”

Dr Atla Srinivas Reddy
డా।। అట్ల శ్రీనివాస్‌రెడ్డి
కౌన్సెలింగ్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌,
‌చేతన సైకాలజికల్‌ ‌ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ ‌సెంటర్‌
9703935321

భారతీయ జీవన విధానంలో మహిళ పాత్ర ఎంతో విశిష్టమైనది. పూర్వకాలంలో స్త్రీ పురుష భేదం ఎక్కువగా కనిపించదు. రాణిరుద్రమ, చాంద్‌ ‌బీబీ, పల్నాటి నాగమ్మ వంటి స్త్రీమూర్తులు రాజకీయంగా సమాజాన్ని ప్రభావితం చేశారు. మాతృమూర్తిని పూజించుకునే విశిష్టలక్షణం భారతీయ సంస్కృతిలో ఉండేది. భారత స్త్రీ ప్రపంచ స్త్రీలందరికీ ఆదర్శం. రాజకీయ వేత్తలుగా, శాసనకర్తలుగా, శాస్త్రవేత్తలుగా, విమానచోదకులుగా, అంతరిక్షంలో వ్యోమగాములుగా, న్యాయవాదులుగా, వైద్యులుగా అన్ని రంగాల్లో స్త్రీలు ముందడుగు వేస్తున్నారు. నేడు మహిళాలోకం స్ఫూర్తిదాయకంగా ఎదుగుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ పురుషాధిక్య సమాజంలో ఆడవారు ఇంకా అవస్తలు పడుతూనే ఉన్నారు. ఆడవారు అర్ధరాత్రి ఎలాంటి భయం లేకుండా తిరగగలిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్య్రం, దేశాభివృద్ధిని ఆ దేశంలోని మహిళల పరిస్థితిని గమనించి తెలుసుకోవచ్చునని పెద్దల కలలు, ఆశయాలు నేటికీ అలాగే ఉండిపోయాయి.ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు మనసును కలచి వేస్తున్నాయి. ఇప్పటికీ మహిళలు ధైర్యంగా రాత్రిపూట బయటికి ఒంటరిగా వెళ్ళలేరు. నేటికీ వివిధ రంగాలలో మహిళలు వెనకబడి ఉన్నారు.

కొనసాగుతున్న వివక్ష – దాడులు: అంతరిక్షంలోకి అడుగు పెట్టినా, ఆర్మీ చీఫ్‌ ‌కమాండర్‌ ‌గా ఎదిగినా, విద్యాధికులైనా, పలు రంగాల్లో స్త్రీ వివక్షకు గురవుతూనే ఉంది. ప్రస్తుతం ఆధునిక వేధింపు ఏమిటంటే యాసిడ్‌ ‌దాడులు. తన మాట వినకపోయినా, ప్రేమించకపోయినా యాసిడ్‌ ‌పోసేయటమే. ఆ అమ్మాయికి కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయని ఆలోచనలేదాయే. ఆకాశంలో సగం అని చెప్పుకోవడమే గానీ రాజకీయాలలో, ప్రాధాన్యత రంగాలలో స్త్రీల శాతం ఎంత ఉన్నది? అతి కొద్దిమంది మాత్రమే ఉన్నత పదవులలో ఉంటున్నారు. అన్నింటిలో వివక్ష కొనసాగుతూనే ఉన్నది. మహిళల స్థితిగతుల్లో ఆశించిన మార్పు రాలేదు. గతంతో పోల్చిచూస్తే ఇటీవలి కాలంలో స్త్రీల దృక్పథంలో చాలా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందరిలోనూ వారి భద్రదపట్ల మరింత అవగాహన పెంచుకునే దిశగా మహిళలు ఆలోచనా సరళిని విస్తృతం చేసుకుంటున్నారు. తమ హక్కులను సాధించుకోవడానికి గళం ఎత్తుతున్నారు. విద్యా, కార్పొరేట్‌ ‌రంగాల్లో తమదైనశైలిలో మహిళాలోకం దూసుకుపోతోంది. అయితే, ఇది చాలదు. ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. నేడు ఎంతో మంది మహిళలు తమ తమ రంగాల్లో రాణిస్తున్నా.. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలనే సంకల్పం క్రిందిస్థాయి వరకు చేరడం లేదు.

- Advertisement -

మాలాలా స్పూర్తి : ఉగ్రవాదంపై బ్రహ్మాస్త్రం.. మలాలా.. పదకొండేళ్ళ ఏళ్ళ వయసులో మలాలా అంతరంగంలో ఎన్నో ప్రశ్నలు చెలరేగాయి. వాటిని వెలిబుచ్చడానికి మలాలా సోషల్‌ ‌మీడియాను మార్గంగా చేసుకుంది.‘గుల్‌ ‌మకారు’ అనే కలం పేరుతో బిబిసి ఉర్దూలోని బ్లాగులో ముస్లిం దేశంలో ఆడపిల్లగా పుట్టినందుకు చదువుకోకూడదా అని ప్రశ్నించింది. ఈ వివక్ష పోవాలని గళంవిప్పి శాంతి బహుమతి తీసుకున్న మలాలాయే ఆదర్శం.

క్రీడాస్ఫూర్తి.. సైనా నెహ్వాల్‌..:క్రీడారంగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన పేరు సైనా నెహ్వాల్‌. ‌భారత మహిళా బ్యాడ్మింటన్‌కు విశ్వఖ్యాతినార్జించిన తొలి మహిళ ఎవరంటే.. సైనా పేరు చెప్పడంలో అతిశయోక్తి లేదు. మహిళా క్రీడాలోకానికి ఆమె స్ఫూర్తిదాయక మహిళ.

శాంతి కుసుమం.. ఇలాభట్‌..: ‌భారతీయ మహిళాలోకం గర్వపడే ‘శాంతి’ కుసుమం ఇలాభట్‌. ‌రాష్ట్రపతి చేతుల మీదుగా ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్న ధీరవనిత ఇలాభట్‌. ‌సెల్ఫ్ ఎం‌ప్లాయిడ్‌ ఉమెన్స్ అసోసియేషన్‌ (‌సేవా) సంస్థ స్థాపించి సమగ్ర మహిళా సాధికారతక కోసం కృషి చేసినందుకు, జీవిత విజయాల పరంపరకుగాను ఈ శాంతి పురస్కారాన్ని అందజేసింది భారత ప్రభుత్వం.

ఎందరో మరెందరో..: ఐ.ఏ.ఎస్‌. ఐ.‌పి.ఎస్‌., ‌లుగా మహిళా కలెక్టర్‌ ‌లుగా సుమిత దావ్రా, స్మితా సబర్వాల్‌, ‌దేవ సేన, సింధూ శర్మ,, భారతదేశ ప్రధానిగా ఇందిరాగాంధీ, శ్రీలంక అధ్యక్షురాలిగా సిరిమావో బండారు నాయకె అత్యుత్తమ సేవలందించి చరిత్రలో చెరగని ముద్రవేసిన విషయం తెలిసిందే. భారత రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్‌, ‌లోక్‌సభ స్పీకర్‌గా మీరాకుమార్‌, ‌యుపిఎ చైర్‌పర్సన్‌గా, కాంగ్రెస్‌పార్టీ అధినేత్రిగా సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా సుష్మాస్వరాజ్‌, ‌సీపీఎం పార్టీ ప్రతినిధిగా బృందాకారత్‌, ఎం‌పీలుగా.. కల్వకుంట్ల కవిత, విజయశాంతి, కేంద్ర మంత్రులుగా పురందరేశ్వరి, పనబాక లక్ష్మి, కిల్లీ కృపారాణి, ఎంపీలుగా జయప్రద, హేమామాలిని, ఎమ్మెల్సీగా నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలుగా పద్మా దేవేందర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, డికె అరుణ, గీతారెడ్డి, గల్లా అరుణ, గాయకులుగా పి.సుశీల, ఎస్‌. ‌జానకి, వాణీజయరాం, ఎల్‌ఆర్‌ ఈశ్వరి, జిక్కీ, జమునారాణి, లతా మంగేష్కర్‌, ఆశాభోంస్లే, భానుమతి, సావిత్రి, జమున, సూర్యకాంతం,.. ఇలా ఎందరో తమ రంగాల్లో రాణించి పేరు తెచ్చుకున్నారు. దేశానికి పేరు తెచ్చారు.

Leave a Reply