Take a fresh look at your lifestyle.

ఘనంగా పత్రీజీ స్మృతి స్మరణోత్సవం

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 24 : ధ్యాన గురువు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రీజీ ధ్యాన జగత్తు కోసం చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్ర సమీపంలోని మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద పత్రీజీ స్మృతి స్మరణోత్సవం వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధ్యానంతో శాంతియుత సమాజాన్ని నిర్మించవచ్చునని అన్నారు. శాకాహార సమాజ స్థాపనకు అహింస మార్గానికి దారి చూపిన మహానీయుడన్నారు. ధ్యాన జగత్తు కోసం ప్రపంచవ్యాప్తంగా 50 పిరమిడ్లను నిర్మించి ఎంతోమందికి ధ్యానం నేర్పిన గురువని కొనియాడారు. అంతకుముందు ఎమ్మెల్యే స్థానిక ప్రజా ప్రతినిధులు పత్రీజీ శక్తి స్థల్ ను సందర్శించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి, ఎంపిటిసి లచ్చిరాం నాయక్, నాయకులు గోపాల్, భూపతిరెడ్డి, వినోద్, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply