Take a fresh look at your lifestyle.

మాట నిలబెట్టుకున్న జగ్గారెడ్డి

  • గాంధీభవన్‌లో మూడు అంబులెన్స్‌లు ఏర్పాటు
  • జెండా ఊపి ప్రారంభించిని పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌

‌హైదారాబాద్‌, ‌మే 24 (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. కోవిడ్‌ ‌పేషెంట్ల కోసం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ ‌రూంకు 2అంబులెన్స్‌లను సమకూరుస్తాననీ చెప్పిన జగ్గారెడ్డి…ఇచ్చిన మాటకంటే అదనంగా మూడు అంబులెన్స్‌లను సమకూర్చారు. కోవిడ్‌ ‌పేషెంట్ల కోసం జగ్గారెడ్డి తన కూతురు జయారెడ్డి అలియాస్‌ ‌కూచీతో కలిసి సమకూర్చిన అంబులెన్స్‌లను పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాంధీభవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పిసిసి మాజీ చీఫ్‌ ‌పొన్నాల లక్ష్మయ్య, పిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జెట్టి కుసుమకుమార్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, యువజన కాంగ్రెస్‌ ‌నాయకురాలు కూచీ, కాంగ్రెస్‌ ‌రాష్ట్ర నేతలు బొల్లు కిషన్‌, ‌మెట్టు సాయి, నగేష్‌ ‌ముదిరాజ్‌ ‌తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌మాట్లాడుతూ…జగ్గారెడ్డి ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన ఈ మూడు అంబులెన్స్‌లు పూర్తిగా ఫ్రీ సర్వీస్‌ అన్నారు.

గాంధీభవన్‌ ‌కంట్రోల్‌ ‌రూంకు ఫోన్‌(040-24601254 ) ‌చేస్తే ఎక్కడ హాస్పిటల్‌కు దింపాలో అక్కడ డ్రాప్‌ ‌చేస్తారన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీ ఆదేశాల మేరకు అంబులెన్స్ ‌సర్వీసులను ప్రారంభించామనీ, హైదరాబాద్‌ ‌సిటీలో 50 కిలో మీటర్ల పరిధిలో ఏ ఆసుపత్రికైనా అంబులెన్స్ ‌సేవలు వినియోగించుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోవిడ్‌ ‌పేషెంట్లకు సంబంధించి ప్రయివేట్‌ ‌దవాఖానల ధరల నియంత్రణ లేదనీ అన్నారు. ప్రయివేట్‌ ‌కార్పొరేట్‌ ‌దవాఖానలలో బిల్లుల విషయంలో కఠినంగా ఉంటామనీ సిఎం కేసీఆర్‌ ‌చెప్పిన మాటలు ఎక్కడ కూడా అమలు కావడం లేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలనీ పిసిసి చీఫ్‌ ‌డిమాండు చేశారు. కొరోనా వైద్యాన్ని పొరుగు రాష్ట్రాలైనా ఆంధ్రప్రదేవ్‌, ‌మహారాష్ట్రలలో ఉచిత వైద్యం అందిస్తున్నారనీ అన్నారు.

తెలంగాణలో మాత్రం ఎందుకు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కొరోనా టెస్టుల విషయంలోనూ ప్రభుత్వం కోర్టు ఆదేశాలు కూడా పాటించడం లేదన్నారు. కొరోనా కేసులను కృత్రిమ సంఖ్య చూపిస్తుందనీ, ఇది మంచిది కాదన్నారు. ఆర్‌టిపిసిఆర్‌ ‌టెస్టు పరికరం కొంటే తప్పేంటన్నారు. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. కొరోనాతో గ్రామీణ ప్రాంతం భయం గుప్పిట్లో ఉందన్నారు. పిసిసి మాజీ ఛీప్‌ ‌పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ… ఇంతటి దురదృష్టకరమైన పరిస్థితు వస్తాయనీ ఎప్పుడూ అనుకోలేదన్నారు. కొరోనా కట్టడిలో ప్రధానమంత్రి మోడీ, సిఎం కేసీఆర్‌ ‌పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఇంత పెద్ద ఉపద్రవం వస్టే పట్టించుకోవడం లేదన్నారు. మోడీ రాష్ట్రాల భుజాన తుపాకీ పెట్టారన్నారు. రాష్ట్రాలేమో అసలు ప్రతిపక్ష పార్టీల నేతల సలహాలు పట్టించుకోవడం లేదన్నారు. టెస్టుల చేయకుండా కొరోనా కేసులు తగ్గాయనీ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. వ్యాక్సిన్‌ ‌పూర్తిగా ఆపేశారన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం బాధ్యతారాహిత్యం కాదా?అని ప్రశ్నించారు.

Leave a Reply