‌తెలంగాణ పౌరుషం బూర్గుల

స్వతంత్ర సమర యోధుడు
రైతాంగ సాయుధ రణ ధీరుడు
అతడే …
తెలంగాణ భానుడు
బూర్గుల నరసింహుడు

రజాకార్ల రాచరిక పోకడపై
రగల్‌ ‘‘‌జెండా’’ ఎత్తినవాడు
నిజాం నిరంకుశ పాలనపై
ధిక్కారాజ్ఞుల చెరిగినవాడు

తెలంగాణ తొలి ,మలి పోరుకు
తెగువతనం గుప్పించినవాడు
విప్లవాల బాటన నడిచినవాడు
ఉద్యమాల ఊపిరిగా తలచినవాడు

నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డవాడు
సమ సమాజం కోసం తపించినవాడు
కడదాక అలుపెరుగని పోరు సల్పి
శాశ్వత నిద్దురలోకి ఒరిగినవాడు
మరలిరాని తీరాలకు తరలినవాడు

త్యాగ ధనుడు …
విప్లవ సూరీడు …
బూర్గుల నరసింహుడు …
మహాభినిష్క్రమణం చేస్తేనేమి ?
తూర్పు కొండలో ఉద్యమ పొద్దై పొడుస్తాడు
జన గుండెల్లో చేతన దీపమై నిత్యం ప్రభవిస్తాడు
కోడిగూటి తిరుపతి: 9573929493

Comments (0)
Add Comment