మోదీ పలాయనవాదం !

ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్న పార్టీలు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సి ఉంటుంటి. తాము అధికారంలో ఏయే మంచి పనులు చేశామో.. ఎవరెవరనికి మంచి జరిగిందో..ప్రజలకు ఏ రకంగా మేలు జరిగిందో చెప్పాలి. కానీ ఈ ఎన్నికల్లో అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ జిఎస్టీ, నిరుద్యోగం, ఉపాధి రంగాలపై ఎలాంటి ప్రభావం కలిగిందో వివరించడం లేదు. ప్రజలు ఈ రంగాల్లో ఎంతగా నష్టపోయారో చెప్పడం లేదు. కానీ కొత్త సమస్యలను తెరపైకి తెచ్చి లబ్దిపొందే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగా రెండు సమస్యలను తెరపైకి తెచ్చారు. ఇవి ఎంత వరకు లబ్ది కలుగచేస్తాయనన్నది చూడాలి. ఇవి ఏ మేరకు బిజెపికి వోట్లు తెచ్చి పెడతాయన్నది చూడాలి. ఇందులో కచ్చతీవు ద్వీపం ఒకటి కాగా…నాటి ప్రధాని మోన్మోహన్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం మరోటి. ఈ రెంటినీ మోదీ ప్రస్తావిస్తూ వోట్లకు పోతున్నారు. నిజానికి మంచి పాలన చేసి, దేశానికి మంచి జరిగివుంటే ఇంతగా రచ్చ చేయాల్సిన అవసరం లేదు.

కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వం లోని కూటమి అధికారం లోకి వొస్తే దేశ సంపదను ఇతరులకు పంపిణీ చేస్తారని ప్రధాని మోదీ రాజస్థాన్‌ ఎన్నికల ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. దేశ ప్రధాన మంత్రి స్థాయిని దిగజార్చే వ్యాఖ్యలు అవి.. వాస్తవ సమస్యల నుండి దృష్టి మరల్చడానికి మోదీ కొత్త వ్యూహాలు పన్నుతున్నారని, విషపూరిత భాషతో ద్వేష ప్రసంగాలు చేస్తున్నారని, అయితే ఈ అబద్దాల వ్యాపారానికి ముగింపు దగ్గరకొచ్చిందని కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడిరది. ప్రజల సంపద అంతా చొరబాటు దారులకు కాంగ్రెస్‌ తిరిగి పంపిణీ చేస్తుందని ప్రధాని మోదీ రాజస్థాన్‌ ఎన్నికల ర్యాలీలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగగా, కాంగ్రెస్‌ కూడా భగ్గుమంది. ధరలు పెరుగుదల, నిరుద్యోగం ప్రముఖంగా ప్రస్తావిస్తూ తాజాగా కాంగ్రెస్‌ విడుదల చేసిన ప్రకటనను షేర్‌ చేస్తూ మోడీ ప్రస్తావించారు. ప్రధాని మోదీ అనేక సమస్యలపై విషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. ఒక చిన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాలి.

1951 నుంచి ప్రతి పదేళ్ల కోసారి జనాభా లెక్కలు నిర్వహిస్తుంటారు. దీనివల్ల షెడ్యూల్‌ కులాలు, తెగల జనాభా ఎంత ఉందో వాస్తవంగా తేలుతుంది.యువత శతం తెలుస్తుంది .అనుకు అనుగుణంగా ఉద్యోగ,ఉపాధి అవకాశాల ప్రణాళికలు రూపొందిచుకో వొచ్చు. 2021లో జనాభా లెక్కలు జరగాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు జరగ లేదు. ఈ విషయంలో ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్‌ మరో విషయాన్ని లేవనెత్తింది. దీనిపై కాంగ్రెస్‌ నేత జైరమ్‌ రమేశ్‌ ప్రశ్నించారు. అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగాన్ని నాశనం చేయడానికే ఈ కుట్ర అని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీని ఓటమి భయం వెంటాడుతోందని, అందు కోసమే రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలకు తెరలేపారని కాంగ్రెస్‌ నేతలు విరుచుకుపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే హిందువుల ఆస్తులను ముస్లింల కు పంచి పెడుతుందంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమైనవన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిందని, ఏ నాడూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు.

ఎన్నికల మొదటి దశ లో తమిళ నాడు లో పోలింగ్‌ పూర్తయింది. ఆ రాష్ట్రం లో పోలింగ్‌ కు ముందు ఎన్నికల సభల్లో భారతీయ జనతా పార్టీ యాభ్కెయేళ్ళక్రితం భారత్‌-శ్రీలంక మధ్య కుదిరిన ద్వ్కెపాక్షిక ఒప్పందంలో భాగంగా పాక్‌ జలసంధిలోని కచ్చతీవు ద్వీపం శ్రీలంక అధీనంలోకి పోయిన అంశాన్ని తమ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంది.. 1974జూన్‌లో ఇందిరాగాంధీ`సిరిమావో బండారునాయకే చేసుకున్న ఈ స్నేహపూర్వక ఒప్పందం మనదేశానికి భద్రతా పరంగా పెద్ద నష్టాన్ని చేకూర్చిందని ప్రధాని నరేంద్రమోదీ తొలిదశ ఎన్నికలకు మందు ప్రస్తావించారు. కొత్త సత్యాలు బయటపడుతున్నాయనీ, దేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్‌ నిర్లక్ష్యం గా పొరుగుదేశానికి కట్టబెట్టిందని ఆయన ట్వీట్లు చేశారు. తమిళనాడులో ఎలాగైనా కాలూనాలన్న బలమైన కాంక్ష వల్ల కాబోలు, కచ్చతీవుకు సంబంధించి ఏదో కొత్తగా బయట పడిరదని మోదీ అన్నారు.

కానీ, తమిళనాట డీఎంకె, అన్నాడీఎంకెలకు ఈ అంశం దశాబ్దాలుగా రాజకీయాస్త్రంగా ఉపకరిస్తున్నదే. తమిళ మత్స్యకారుల విూద శ్రీలంక దాష్టీకం ప్రదర్శించినప్పుడల్లా తమిళనాడులో రాజుకొనే వేడి ఇదే. కచ్చతీవు అప్పగింత రాజ్యాంగ వ్యతిరేకమని 2008లో జయలలిత సుప్రీంకోర్టులో కేసువేయడం, దానిని వెనక్కి తీసుకోవాలంటే యుద్ధం ఒక్కటే మార్గమని అటార్నీ జనరల్‌ పేర్కొనడం ప్రధానికి తెలియనివేవిూ కావు. మోదీ తొలివిడత పాలనలో బంగ్లాదేశ్‌తో చేసుకున్న ఓ ఒప్పందంతో కాంగ్రెస్‌ ఈ కచ్చతీవు ఒప్పందాన్ని పోలుస్తోంది. భారతదేశానికి చెందిన 111 చిన్నాచితకా భూభాగాలను బంగ్లాదేశ్‌కు ఇచ్చేస్తూ, ఈ సరిహద్దుల ఒప్పందం కేవలం భూమికి పరిమితమైనది కాదని, రెండు హృదయాల కలయికని మోదీ వ్యాఖ్యానించిన విషయాన్ని కాంగ్రెస్‌ గుర్తుచేస్తూ ఎదురుదాడికి దిగుతోంది. పదేళ్ళపాలన తరువాత, సరిగ్గా లోక్‌సభ ఎన్నికలముందు కచ్చతీవుతో ముడిపడిన దేశసమగ్రత, భద్రత ప్రధానికి గుర్తురావడం విశేషం. ఇందిరా గాంధీ ఎంతో నిర్లక్ష్యంగా ఈ కీలకమైన ప్రాంతాన్ని లంకకు ఇచ్చేశారని బీజేపీ పెద్దలు రాద్దాంతం చేయడం ఎన్నికల ఎత్తుగడగానే చూడాలి. కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలోకీ, ఇరకాటంలోకి నెట్టడానికి ప్రయత్నించడంలో భాగమే అన్న విమర్శలపై సమాధానం రావాల్సి ఉంది.

మొత్తంగా ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజలకు సంబంధం లేని రెండు విషయాలపై చర్చ సాగదీస్తున్నారు. పదేళ్లుగా అధికారంకు దూరంగా ఉన్న కాంగ్రెస్‌ను మోదీ ఎందుకు ఇంకా వెన్నాడుతున్నారన్నదే సమస్య. ప్రజలకు మంచి చేస్తే మంచి గురించి చెప్పాలి. కానీ ఏనాడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మోదీ ప్రస్తావించడం లేదు. తాను చేసిందే అంతా మంచి అనే భావనలో ఉన్నారు. అందుకే ఏదో భయం ఆవరించి ఉంటుందని కాంగ్రెస్‌ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రజలు కూడా ఎవరేంటో పరిశీలించుకునే అవకాశం ఉంది.
ప్రజాతంత్ర డెస్క్‌

Comments (0)
Add Comment