సమరయోధుల ఆకాంక్షలు సాకారం చేసుకుందాం..!

“భారతదేశంలో వర్తక వ్యాపారుల కోసం పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి, బ్రిటిష్‌వారు వచ్చారు. క్రీ।।శ।। 1600 సం।।లో బ్రిటిష్‌వారు ఈ దేశంలోని స్వదేశీ రాజుల మధ్య వివాదాలు సృష్టించి, వ్యాపారులుగా వచ్చినవారు సామ్రాజ్య కాంక్షతో రాజకీయాల్లో ప్రవేశించారు. విడదీసి పాలించే విధానాలను భరించలేక బ్రిటిష్‌వారిపై స్వదేశీ రాజులు తిరుగుబాటు చేశారు. 1857లో సిపాయిలు పాల్గొన్నారు. దీనికి ఝాన్సీలక్ష్మిబాయి, తాంతియాతోపే లాంటి రాజులు నాయకత్వం వహించారు. ఇది ప్రథమ స్వాతంత్య్ర సమరంగా చరిత్రలో లిఖించబడింది.”

‘‘15 ఆగష్టు స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా..
నేడు మనదేశంలో జరుపుకుంటున్న 75 వసంతాల అమృతోత్సవాల వేళ భారత స్వాతంత్య్ర సంగ్రామ మహోజ్వల ప్రధాన ఘట్టాలను మననం చేసుకుందాం.. మడమ తిప్పకుండా పునరంకిత•మవుదాం..
భారతదేశంలో వర్తక వ్యాపారుల కోసం పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి, బ్రిటిష్‌వారు వచ్చారు. క్రీ।।శ।। 1600 సం।।లో బ్రిటిష్‌వారు ఈ దేశంలోని స్వదేశీ రాజుల మధ్య వివాదాలు సృష్టించి, వ్యాపారులుగా వచ్చినవారు సామ్రాజ్య కాంక్షతో రాజకీయాల్లో ప్రవేశించారు. విడదీసి పాలించే విధానాలను భరించలేక బ్రిటిష్‌వారిపై స్వదేశీ రాజులు తిరుగుబాటు చేశారు. 1857లో సిపాయిలు పాల్గొన్నారు. దీనికి ఝాన్సీలక్ష్మిబాయి, తాంతియాతోపే లాంటి రాజులు నాయకత్వం వహించారు.

ఇది ప్రథమ స్వాతంత్య్ర సమరంగా చరిత్రలో లిఖించబడింది. స్వదేశీరాజుల అనైక్యత వలన ప్రభావం అంతగా చూపలేదు. ఆ తర్వాత క్రమంగా 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావంతో స్వాతంత్య్రోద్యమ చరిత్ర 1) మితవాద, 2) అతివాద, 3) గాంధేయ మార్గంలో మహోజ్వలంగా మారి సామాన్య ప్రజల్లో స్వాతంత్య్ర ఆకాంక్ష పెరిగింది. వేరు వేరు మార్గాలు ఎంచుకున్న వీరందరి అంతిమలక్ష్యం దండిగా స్వాతంత్య్ర కాంక్ష పెంచటానికి తోడ్పడినాయి. బ్రిటిష్‌ ‌పాలన ఎందుకు వద్దో.. స్వేచ్ఛ స్వాతంత్య్రాలు, స్వపరిపాలన, స్వీయ నిర్ణయాల ఆవశ్యకత నూరిపోయడంతో ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం పెరిగింది. అలా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో సిపాయిల తిరుగుబాటు నుండి క్రమేణా మితవాదుల కాలంలో దేశ ప్రజల సంక్షేమం దృష్ట్యా రాజకీయ, సాంఘిక, ఆర్థిక సంస్కరణలు కావాలని ప్రార్థన, విజ్ఞప్తి లాంటి శాంతియుత మార్గాల ద్వారా బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి విన్నవించేవారు.

దాదాభాయి నౌరోజీ, ఎ. ఒ. హ్యూమ్‌ ‌సురేంద్రనాధ్‌ ‌బెనర్జీ, గోఖలేలు ఉన్నారు. అతివాదుల కాలంలో, గతంలోని మితవాదులు శాంతియుత విధానాల ద్వారా బ్రిటిష్‌ ‌పాలకుల నుండి ఆశించిన ప్రయోజనాలు పొందలేకపోయామనుకొని, కాంగ్రెస్‌లోని ఒక వర్గం వారు మాటల ద్వారా కాదు ? చేతల ద్వారానే కోర్కెలను సాధించుకోవాలన్నారు. వారిలో బాలగంగాధర్‌ ‌తిలక్‌, ‌లాలాలజపతిరాయ్‌, ‌బిపిన్‌ ‌చంద్రపాల్‌ ‌ముఖ్యులు వీరే ‘‘లాల్‌- ‌బాల్‌- ‌పాల్‌’’ ‌పేరుతో అతివాదులుగా పిలువబడ్డారు. ఆనాడు స్వాతంత్య్రోద్యమ నాయకుల పిలుపు అందుకొని బానిసత్వ శృంఖలాలు తెంచడమే లక్ష్యంగా బ్రిటిష్‌ ‌వలస పాలకుల తూటాలకు ఎదురొడ్డి వారి ప్రాణాల్నే తృణప్రాయంగా త్యజించిన భరతమాత ముద్దుబిడ్డల వీర గాథలు, ఘట్టాలు ఆసేతు హిమాచలాన్ని కదిలించేలా చేసినాయి. వందేమాతర ఉద్యమం – స్వదేశీ ఉద్యమం జలయన్‌ ‌వాలాబాగ్‌ ‌దురంతాలతో దేశం అట్టుడికిపోయింది. స్వాతంత్య్ర కాంక్ష పెరిగిపోయి భారతీయుల్లో ఐక్యతకు బాటలు పడినవి.

బ్రిటిష్‌ ‌ప్రభుత్వాన్ని ఉద్యమ కారులు వారి ఆలోచనలతో గడగడలాడిస్తూ తెల్లవారి గుండెల్లో కల్లోలం సృష్టించారు. స్వరాజ్యం నా జన్మహక్కు, వందేమాతరం ఇంక్విలాబ్‌ ‌జిందాబాద్‌ ‌లాంటి నినాదాలు, ఆజాద్‌ ‌హింద్‌ఫౌజ్‌ ‌సహాయ నిరాకరణోద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పును నిప్పు కణికగా మార్చిన దండి సత్యాగ్రహం, క్విట్‌ ఇం‌డియా ఉద్యమం లాంటి మొదలైనవి జాతిని జాగృత పరిచినాయి. గాంధేయ మార్గాలతో ఆ తరువాత స్వాతంత్య్ర సముపార్జనలో ఉద్యమకారులుగా, సంస్థలుగా అనేక మార్గాలను ఎంచుకొని సుమారు రెండు శతాబ్దాల సుదీర్ఘ పోరును కొనసాగించారు. చివరగా గాంధీ నేతృత్వంలో అహింసా మార్గాన దేశమంతా పర్యటించి ప్రజా ఉద్యమంగా మారడంతో బ్రిటిష్‌ ‌పాలకులు తోకముడిచి స్వాతంత్య్రాన్ని ప్రకటించి వెళ్లిపోయారు. కాదు కాదు మనం వారిని తరిమికొట్టాం.. 1947 ఆగష్టు 15 నుండి స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ఆ తర్వాత డా।। బి.ఆర్‌. అం‌బేద్కర్‌ అద్యక్షతన మన దేశానికి రాజ్యాంగాన్ని రాసుకొని ప్రజా స్వామ్య పాలనను కొనసాగించు కుంటున్నాము.

వీరితో పాటు స్వాతంత్య్రోద్యమ చరిత్రలో లిఖించబడని ఎందరో అజ్ఞాత ఉద్యమకారుల త్యాగాల స్ఫూర్తితో 75 వసంతాల స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా.. ‘‘ఈ దేశం నాకేమిచ్చింద’’న్న నిరాశ నిస్ప•హలను వీడి దేశ అభ్యున్నతికి తోడ్పడాలి. మహోద్విగ్న క్షణాల్ని, ప్రముఖ ఘట్టాల్ని జాతిలో చైతన్యాన్ని రేపిన దేశభక్తిని స్ఫురణకు తెచ్చే విధంగా దేశవ్యాప్తంగా ఆనాటి చారిత్రక ప్రాధాన్యత గల 75 చోట్ల, 75 వారాలుగా అమృతోత్సవాలు నిర్వహించుకోవడం అభినందనీయం. తరువాత ఆ స్ఫూర్తిని పునరుత్తేజింపచేసుకొని పాలకులు, పాలితులు నిస్వార్థంగా చిత్తశుద్ధితో అసమానతలు లేని సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావలసి ఉందని భావించండి. అవినీతి వటావృక్షానికి తల్లివేరు అన్ని విధాలా రాజకీయ అవినీతేనని అనేక నివేదికలు చెప్పుచున్న వేళ స్వార్థంతో సంపాదనే ధ్యేయంగా రాజకీయాల్లోకి రావద్దు. ప్రజల బ్రతుకులు మార్చడానికి రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే… రాజకీయం వ్యాపారమో ! ఉద్యోగమో ! కాదు ? ఇది ఒక సామాజిక బాధ్యతగానే భావిస్తూ పాలకులు సేవకులనేది విస్మరించకండి. సేవచేసి తరించండి. సగటు పౌరుల జీవితాల్లో ఆశించిన మార్పులు తీసుకొని రావడంతో అసమానతలు లేని శ్రేయోరాజ్య నిర్మాణానికి స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగానైనా పాలకులు, నాటి త్యాగాల స్ఫూర్తితో ముందుకు సాగుతూ వారి ఆకాంక్షలు నెరవేర్చాలని ఆశిద్ధాం.. అదే వారికిచ్చే నిజమైన నివాళి.
– మేకిరి దామోదర్‌
‌వరంగల్‌, 9573666650

AP breaking newsaspirationspolitical updatesprajatantra newstelangana headlinestoday updateswarriors come true ..!
Comments (0)
Add Comment