కొరోనా కట్టడికి .. శక్తివంచన లేకుండా కృషి

  • వైరస్‌ ‌సోకిన వారిని వెలేస్తే కఠిన చర్యలు
  • జితో కోవిడ్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌

‌కొరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పనిచేస్తుందని  ఆర్థికశాఖమంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. కొరోనాను అందరం కలిసికట్టుగా ఎదుర్కొందామని అన్నారు. వైరస్‌ ‌వచ్చిన వారి పట్ల దురుసుగా ఉండకూడదని మంత్రి సూచించారు.  బేగంపేటలోని ‘జితో కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్‌’‌ను హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వంద పడకల హాస్పిటల్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేసిన మహవీర్‌, ‌జితో టీంకు మంత్రి అభినందనలు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం చేసిన మహావీర్‌, ‌జీతో టీంకు ధన్యవాదాలు తెలిపారు. మహవీర్‌ ‌హాస్పిటల్‌ అధ్వర్యంలో పేదల కోసం కొవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కొరోనా రాకుండా అడ్డుకోవాలి కానీ, వచ్చిన వారిని కాదన్నారు.  ఊర్లలోకి రానివ్వం, ఇండ్లను ఖాళీ చేయించడం కరెక్ట్ ‌కాదన్నారు.

ఇలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే వైరస్‌ ‌సోకిన వారిపట్ల దురుసుగా ఉండకూడదని మంత్రి హరీష్‌రావు తెలిపారు. కొరోనా వచ్చిన వారితో ఇళ్లు ఖాళీ చేయించడం, ఊర్లోకి రానివ్వకపోవడం కరెక్ట్ ‌కాదని అలా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. మహావీర్‌ ‌హాస్పిటల్‌ ఆధ్వర్యంలో పేదల కోసం ఇది ప్రారంభించినట్లు తెలిపారు. కొరోనాను అందరం కలిసికట్టుగా ఎదుర్కొందామని మంత్రి పిలుపునిచ్చారు.  దేశంలో, ప్రపంచంలో ఎక్కడ చూసినా కోవిడ్‌ అనేది ఉందని.. దాన్ని ఎదుర్కొనే సత్తా మనకు ఉండాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో జైన్‌లు ముందుంటారని వారి సేవలను ఆయన కొనియాడారు. త్వరలోనే జైన్‌ ‌కమ్యూనిటీ పెద్దలను సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సమావేశం ఏర్పాటు చేయిస్తామని హరీష్‌ ‌తెలిపారు. 100 పడకల హాస్పిటల్‌ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌ప్రభుత్వం శక్తివంచన లేకుండా పని చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి జైన్‌ ‌కమ్యూనిటీ పెద్దలను కలిపిస్తానని హా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ ‌పాల్గొన్నారు.

control Coronaetela meetingshypocrisyminister harish rao
Comments (0)
Add Comment