ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

ప్రభాకర్‌ రావుకు రెడ్‌ కార్నర్‌ నోటీసులు
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే ఆయనపై పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. అయిదే ఆ నోటీసులకు ప్రభాకర్‌ రావు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాజాగా రెడ్‌ కార్నర్‌ తాఖీదులిచ్చారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ప్రణీత్‌ రావును పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఫ్యామిలీ ట్రిప్‌ పేరుతో ఆయన రాష్ట్రం విడిచిపెట్టి పోయారు. అనంతరం విదేశాలకు వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం ఆయన అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల వీసాపై ప్రభాకర్‌రావు అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. కాగా, తాను క్యాన్సర్‌ చికిత్స కోసం అమెరికా వొచ్చినట్లు ప్రభాకర్‌రావు ఇప్పటికే వెల్లడిరచారు. జూన్‌ లేదా జూలైలో హైదరాబాద్‌కు తిరిగి వొస్తానని గత నెల ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్‌లో తెలిపిన విషయం తెలిసిందే.

Comments (0)
Add Comment