మత్స్యకారుల ఆర్థికాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

జిల్లా వ్యాప్తంగా 1,596 చెరువుల్లో 5 కోట్ల చేప పిల్లల పెంపకం: మంత్రి హరీష్‌రావు

మత్స్యకారుల ఆర్థికాభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందనీ రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం మెదక్‌ ‌జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం (ప్రగతి ధర్మారం)లో మంగళవారం మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి గ్రామంలోని ఊర చెరువులో సమీకృత మత్స్య అభివృద్ది పథకం కింద ఒక కోటి డెబ్బై ఆరు లక్షల చేప పిల్లలను మంత్రి హరీష్‌రావు విడుదల చేశారు.
అనంతరం గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనంతో పాటు డంప్‌యార్డు, వైకుంఠ ధామాలను ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ‌నగేష్‌, ‌జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాస్‌, ‌స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
district Minister Harish Raominister harish raoponds across
Comments (0)
Add Comment