విద్యుత్ ప్రమాద బాధితులకు నష్టపరిహారం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 9:  పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో విద్యుత్తు ప్రమాదాలలో పశు సంపదను కోల్పోయిన రైతులకు, మృతి చెందిన బాలుడి కుటుంబానికి విద్యుత్ శాఖ నుండి మంజూరైన నష్టపరిహారం చెక్కులను సోమవారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బాధితులకు పంపిణీ చేశారు. జిన్నారం, గుమ్మడిదల, పటాన్ చెరు మండలాల పరిధిలోని గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించిన 13 బర్రెలు విద్యుత్ ప్రమాదంలో మరణించగా, ఒక్కో బర్రెకు 40 వేల రూపాయల చొప్పున ఐదు లక్షల 20వేల రూపాయల విలువైన పరిహారాన్ని అందించారు. బొల్లారం మున్సిపల్ పరిధిలో విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన రిషి అనే బాలుడి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నష్ట ప్రహరిహారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, గుమ్మడిదల జెడ్పిటిసి కుమార్ గౌడ్, విద్యుత్ శాఖ డీఈ రమేష్ చంద్ర, ఏడి దుర్గాప్రసాద్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మురళి, షేక్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *