మరోమారు ఇడి ఎదుట హాజరైన రాహుల్‌

న్యూ దిల్లీ, జూన్‌ 20 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌మనీ లాండరింగ్‌ ‌కేసులో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మరోసారి సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అధికారులు రాహుల్‌ను ప్రశ్నించారు. ఇప్పటి వరకు మొత్తం రాహుల్‌ను 30 గంటలపాటు ఈడీ ప్రశ్నించింది. కాగా కాంగ్రెస్‌ ఆం‌దోళనలతో ఈడీ కార్యాలయం, జంతర్‌మంతర్‌ ‌దగ్గర పోలీస్‌ ‌భద్రతను పెంచారు. అలాగే ఏఐసీసీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

కాంగ్రెస్‌ ‌కార్యకర్తలను ఏఐసీసీ ఆఫీస్‌లోకి పోలీసులు అనుమతించ లేదు. ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఈడీ అధికారులు రాహుల్‌ ‌గాంధీని ప్రశ్నించారు. తిరిగి శుక్రవారం 17న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అయితే శుక్రవారం రాలేనని, రెండు రోజుల తర్వాత వొస్తానని రాహుల్‌ ‌పేర్కొన్నారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తల్లి సోనియా గాంధీ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత తనపై ఉందని ఈడీకి తెలిపారు. రాహుల్‌ ‌విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఈడీ అధికారులు తిరిగి సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించగా ఆయన హాసరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *