Take a fresh look at your lifestyle.

పరిగి పోలీసులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మాజీ జడ్పీటీసీ చంద్రయ్య

పరిగి : కొరోనా నేపథ్యంలో పోలీసుల సేవలు మరువలేనివని మాజీ జడ్పీటిసి చంద్రయ్య అన్నారు. గురువారం పరిగి స్థానిక పోలీస్‌ ‌స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సొంత డబ్బులతో నిత్యావసర వస్తువులను సర్కిల్‌ ‌కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొరోనా నివారణ కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. అలాంటి  పోలీసులకు సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని  అన్నారు. అంతేకాక మరికొన్ని ప్రాంతాలలో పోలీసులు వారి ఔదార్యాన్ని చాటుతున్నారని అలాంటి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు . కార్యక్రమంలో సిఐ లక్ష్మీ రెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్లు,  జన్‌ ‌సాహస్‌ ‌బోర్డ్ ‌డైరెక్టర్‌ ‌నవీన్‌ ‌కుమార్‌, ‌వికారాబాద్‌ ‌జిల్లా కో ఆర్డినేటర్‌ ‌ప్రకాష్‌ ‌కుమార్‌, ‌లీగల్‌ ‌సెల్‌ ‌సభ్యులు కైసర్‌ ‌పాషా, నాయకులు గొల్ల మల్లేష్‌, ‌వంశీ, ప్రశాంత్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply