Take a fresh look at your lifestyle.

జెడ్పీ జిపిఎఫ్‌ ‌సమస్యలను వెంటనే పరిష్కరించాలి: డిటిఎఫ్‌

ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాను ఆరు జిల్లాలుగా విభజించి సంవత్సరాలు గడుస్తునందున జడ్‌పి జిపిఎఫ్‌ ‌నిధులు ఆయా జిల్లాల ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాలలో వెంటనే పంపిణి చేసి అప్‌డేషన్‌ ‌చేయాలని వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా ముఖ్య కార్యనిర్వాహణాధికారిని డిటిఎఫ్‌ ‌నాయకులు డిమాండ్‌ ‌చేశారు. అప్‌డేషన్‌ ‌చేయడంలో సంవత్సరాలు జాప్యం జరుగుతుందన్నారు. దీంతో లోన్స్, ‌పార్‌ ‌ఫైనాల్స్ ‌మంజూరు చేయడంలో, మార్చి 2020 కాకుండా అక్టోబర్‌ 2016‌ను పరిగణనలోకి తీసుకోవడం అన్యాయమన్నారు.

చెల్లింపులలో నెలల తరబడి జాప్యం చేస్తున్నారన్నారు. రిటైర్‌ ఉపాధ్యాయులకు ఫైనల్‌  ‌పెమెంట్స్ ‌మంజూరులో జాప్యం చేయడం, లోన్స్, ‌పార్ట్ ‌ఫైనల్‌ ‌కోసం ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులను తీసుకోకపోవడంలో జఠిలమై సమస్యలుగా మారుతున్నాయన్నారు. ఈ సమస్యలను పది రోజులలో పరిష్కరించకుంటే జిల్లా పరిషత్‌ ‌కార్యాలయం ముందు ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాస్‌, ‌టి.సుదర్శన్‌, ‌కె.దేవేందర్‌, ‌మహేందర్‌రెడ్డి, ఎ.గోవిందరావులు పాల్గొన్నారు.

Leave a Reply