Take a fresh look at your lifestyle.

నేటి మిట్టమధ్యాహ్నం జీరో షాడో

అరుదైన ఘట్టం కోసం ఎదురుచూపు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 8 : ఈ నెల 9న నగరంలో అరుదైన సంఘటన ఆవిష్క•తం కాబోతున్నది. మంగళవారం మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12:14 అంటే రెండు నిమిషాల వ్యవధిలో నీడ మాయం కానుంది. మంగళవారం సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని జీరో షాడో డేగా పిలుస్తారని తెలిపారు. ఎండలో నిటారుగా 90డిగ్రీలలో ఉంచిన వస్తువుల నీడ రెండు నిమిషాల పాటు అంటే 12.12 గంటల నుంచి 12.14 గంటల వరకు కనిపించదని బిర్లా సైన్స్ ‌సెంటర్‌ ‌టెక్నికల్‌ అధికారులు పేర్కొన్నారు. ఇటువంటి అరుదైన సంఘటనను నగరవాసులు తప్పకుండా అనుభూతి చెందాలని సూచించారు. సూర్యకాంతిలో ప్రతి వస్తువుకు నీడ ఉంటుంది. కానీ అదే సూర్య కాంతిలో నీడ ఉండదనే అద్భుతం వెనక అనేక కారణాలు ఉన్నాయని వివరించారు. కాగా, ఇటీవల నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆ రోజు వాతావరణ పరిస్థితుల్లో తేడాలు ఏర్పడితే సూర్యుడు కనిపించకపోవడం వల్ల ఈ అద్భుతాన్ని చూసే అవకాశం ఉండదని పేర్కొన్నారు. భూమి ప్రతిరోజు తనచుట్టూ తాను తిరుగుతుంది. ఈ ఆత్మ భ్రమణానికి 24 గంటల
సమయం పడుతుంది. అలా తిరగడం వల్ల సూర్యుడు తూర్పు నుంచి ఉదయించి పడమరలో అస్తమించినట్టుగా కనిపిస్తుంది. ఈ ప్రయాణంలో మధ్యాహ్నం వేళ సూర్యుడు మన తలదుగా వెళుతూ సూర్యకిరణాలు నిట్ట నిలువుగా 90 డిగ్రీల కోణంలో భూమి ద పడినప్పుడు ఆ సమయంలో నిలువుగా ఉన్న వస్తువు నీడ కనిపించదు. కారణం ఆ నీడ ఆ వస్తువు దనే పడుతుంది. దీనిని శూన్యపు నీడ క్షణం లేదా జీరో షాడో మూవ్‌మెంట్‌ అని పిలుస్తారని ప్రొఫెసర్‌ ‌శాంతి ప్రియ పేర్కొన్నారు. ప్రతిరోజు సూర్యుడు మధ్యాహ్నం తలదుగా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అలా అని ప్రతిరోజు జీరో షాడో ఉండదని శాస్త్రవేత్తలు అన్నారు.

సూర్యుడు ప్రతి రోజు మిట్ట మధ్యాహ్నం మన తలపై దుగా వెళ్లడు. అలా వెళితే జీరో షాడో మూవ్‌మెంట్‌ ‌గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. భూమి గోళాకారంలో ఉండటం వల్ల సూర్య కిరణాలు మధ్యాహ్నం పూట భూ మధ్య రేఖపై మాత్రమే పడుతాయి. దానికి ఉత్తరాన, దక్షిణాన నేరుగా పడవని చెప్పారు. భూమి కొన్ని సార్లు ఉత్తరముఖంగా, మరికొన్ని సార్లు దక్షిణముఖంగా ప్రయాణి స్తుంది. భూమిపై ఉన్న మనకు సూర్యుని గమనం ఉత్తరయాణంలో 6 నెలలు ఉత్తరదిశగా.. దక్షిణాయానంలో 6 నెలలు దక్షిణ దిశగా ఉంటుంది. ఈ సమయంలో భూమి వంపు సుమారు 23.5 డిగ్రీలు ఉంటుందని తెలిపారు. దీనివల్ల భూమధ్య రేఖకు అన్ని డిగ్రీల ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సూర్యుడు మధ్యాహ్నం నేరుగా తల దు నుంచి వెళ్తాడని వివరించారు. ఈ ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతం అని పిలుస్తారని చెప్పారు. ఏడాదికి రెండుసార్లు జీరో షాడో మూవ్‌మెంట్‌ ‌జరుగుతుంది. అంటే ఉత్తరయాణంలో ఒక్కసారి, దక్షిణయానంలో మరొక్కసారి ఉంటుందని పేర్కొన్నారు.

Leave a Reply