Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడి ప్రతి ఒక్కరి బాధ్యత వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ‌మెతుకు ఆనంద్‌

‌వికారాబాద్‌ : ‌కొరోనా కట్టడి ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ‌మెతుకు ఆనంద్‌ ‌తెలిపారు. సోమవారం వికారాబాద్‌ ‌మునిసిపల్‌ ‌లోని పలు వార్డులలో ఆయన పర్యటించి లాక్‌ ‌డౌన్‌లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్‌ ‌మాట్లాడుతూ వికారాబాద్‌ ‌లోని అనంతగిరి పల్లి, గెరిగెట్‌ ‌పల్లి, కొంపల్లి, కొత్తగడి లలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలకు సరైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. పలు ప్రాంతాల్లో కూరగాయలు పంపిణీ చేశామని తెలిపారు. ఇంకొంత కాలం ప్రజలు ఇదే విధంగా సహకరించాలని ఆయన కోరారు.

కొరోనా కట్టడి ప్రజలందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ ‌పాటించి, మాస్కు లు ధరించి వైరస్‌ ‌నివారణలో భాగస్వామ్యం కావాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తీసుకుంటున్న చర్యలను ప్రపంచమంతా హర్షిస్తున్నదన్నారు. వికారాబాద్‌ ‌నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. వైరస్‌ను అరికట్టేందుకు ఆహోరాత్రులు పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, వైద్యులు, పోలీసులు, రెవెన్యూ, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎం‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌చిగుళ్లపల్లి రమేష్‌ ‌కుమార్‌ ‌మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌భోగేశ్వర్లు వెంకటేశ్వరరావు టిఆర్‌ఎస్‌ ‌పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌ ‌రెడ్డి నాయకులు రెడ్యానాయక్‌ ‌స్థానిక కౌన్సిలర్లు తదితరలు పాల్గొన్నారు.

Leave a Reply