Take a fresh look at your lifestyle.

రానున్న కాలంలో జర భద్రం : పెద్ది

రానున్నది వర్షాకాలమని, ప్రజలు జర భద్రంగా ఉండాల్సిన అవసరం ఉందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు, చెన్నరావుపేట మండల కేంద్రంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఆయన ప్రారంబించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 8వ తేదీ వరకు ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం జరుగనున్నట్లు ఆయన చెప్పారు. రానున్న వర్షాకాలంలో సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలకుండా ప్రజలు బాధ్యతతో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖాళీ ఫ్లాట్స్ ‌గల యజమానులు వారి స్థలాల్లో, ఇంటి ముందు నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలనీ లేని యెడల మున్సిపాలిటీ కొత్త చట్టం ప్రకారం వారిపై తగు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన హెచ్చ రించారు.

వర్షాకాలంలో సీజనల్‌ ‌వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, వైరల్‌ ‌ఫీవర్‌ ‌లాంటి వ్యాధులతో ప్రజలు అనారోగ్యానికి గురవుతారని, దానికి తోడు ఈ కరోనా వైరస్‌ ‌పెనుభూతంలా వెంటాడుతోందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌గుంటి రజినీ కిషన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌వెంకట్‌రెడ్డి, కమిషనర్‌ ‌విద్యాధర్‌, ‌స్థానిక కౌన్సిలర్‌, ‌చెన్నారావుపేట మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌, ఆరెస్సెస్‌ ‌కన్వీనర్‌, ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌, ‌గ్రామ పంచాయతి సిబ్బంది, సంబంధిత అధికారుల పాల్గొన్నారు.

Leave a Reply