బూర్గంపాడు మండలం లోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం బూర్గంపాడు గ్రామపంచాయతీ లో కరోనా కేసులు వచ్చిన నేపథ్యంలో బుధవారం కామిరెడ్డి శ్రీలత ఆయా గ్రామాలలో సందర్శించారు. అనంతరం ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావాలని అన్నారు. కరుణ పేషెంట్లు ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కిషోర్, మండల ప్రత్యేక అధికారి చంద్రప్రకాష్ ,యంపిడిఓ శంకర్ ,రెడ్డిపాలెం సర్పంచ్ భూక్య శ్రావణి ,పంచాయతీ సెక్రటరీ రాజేష్ ,విఆర్వో జోగారావు ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు.