Take a fresh look at your lifestyle.

పోతిరెడ్డిపాడుపై కేసీఆర్‌ కప్పదాటువైఖరి: రాణిరుద్రమ

కృష్ణాజలాల మీద పంచాయతీ నడుస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ గోదావరి జలాల మీద మాట్లాడడం కప్పదాటు వైఖరేనని యువతెలంగాణ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణిరుద్రమరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు, వాదనలపై మంగళవారం ఆమె తీవ్రస్థాయిలో భగ్గుమన్నారు. జీవో 203 తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేదా కాదా? ముఖ్యమంత్రి సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి ధోరణి మారకుంటే పోతిరెడ్డిపాడుపై ప్రజాఉద్యమం చేస్తామన్నారు.

రైతుబంధు ఎగ్గొట్టడానికే నిర్భంద వ్యవసాయ విధానం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమల్లోకి తెస్తున్నాడని, పుష్కలంగా నీళ్ళున్నచోట వరిపంట వద్దు.. పత్తివేయమనడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒంటెద్దుపోకడలకు నిదర్శనమన్నారు. ఏ చట్టప్రకారం నిర్భం వ్యవసాయ విధానం అమలుచేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో 19లక్షల ఎకరాల్లోనే పత్తి కొనలేకపోయిన ప్రభుత్వం ఇపుడు 70లక్షల ఎకరాల్లో పత్తి ఎలా కొంటుందని ప్రశ్నించారు. 2016 lo  పత్తిసాగు చేస్తే నష్టాలొస్తాయని చెప్పిన కేసీఆర్‌.. ఇపుడు మళ్ళీ పత్తి సాగుచేయమనడం, వరిని బంద్‌ పెట్టమనడం ఆయన రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతున్నదని విమర్శించారు.

Leave a Reply