Take a fresh look at your lifestyle.

రైతులకు మద్దతు ధర ధాన్యం క్వింటాకు రూ. 2500ఇవ్వాలి

యువతెలంగాణ పార్టీ వర్కిింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ డిమాండ్

రైతుల పంటకు మద్దతు ధర పెంచాలని, కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బోనస్ ఇచ్చి రైతులకు అండగా నిలవాలని యువతెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మీడియా సమావేశం నిర్వహించిన ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయి ఆచరణ కు సంబంధం లేదని, ప్రతి గింజ కొంటామని చెబుతున్నా గ్రామస్థాయిలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నెలరోజుల్లో కేవలం 25శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని, తరుగు పేరుతో మిల్లర్లు చేస్తున్న దోపిడీ రైతులకు శాపంగా మారిందన్నారు.

రైతు పెట్టే పెట్టుబడికి రాబడికి సంబంధం లేదని, రైతుబంధు అందరిబంధు కాలేదన్నారు. ధాన్యం క్వింటాకు రూ. 2500, మక్కలకు రూ. 2వేలు పత్తికి రూ. 7500 ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. బత్తాయి, మామిడి కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలన్నారు. ప్రస్తుత మద్దతు ధరలతో ఆరుగాలం శ్రమించిన రైతుకు కూలికూడా గిట్టుబాటు కావడం లేదన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు రూ. 2వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని, ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉద్యోగులు, పురోహితులకు, మధ్యతరగతి ప్రజలందరికీ ప్రతి కుటుంబానికి రూ. 5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!