Take a fresh look at your lifestyle.

‌ప్రైవేటీకరణకు వైకాపా వ్యతిరేకం

  • విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
  • విశాఖ ఉక్కుకు ఒడిశా గనులు కేటాయించండి
  • నిర్మలా సీతారామన్‌ను కోరిన విజయసాయిరెడ్డిి

‌విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసే అంశాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని.. ప్రైవేటీకరణకు వైకాపా ప్రభుత్వం వ్యతిరేకమని చెప్పారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన అనంతరం సహచర ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి విజయసాయిరెడ్డి వి•డియాతో మాట్లాడారు.

తెదేపా హయాంలో 56 సంస్థలను అమ్మేశారని.. అలాంటిది విశాఖ ఉక్కు కర్మాగారం కోసం పోరాడతామంటూ తెదేపా అధినేత చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంపై నిర్మలా సీతారామన్‌కు పలు సూచనలు చేసినట్లు చెప్పారు. ఉక్కు కర్మాగారానికి ప్రత్యేకించి ఐరన్‌ ‌గనులు లేకపోవడమే నష్టాలకు కారణమని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.

ఒడిశాలోని ఐరన్‌ ‌గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని నిర్మలాసీతారామన్‌కు సూచించినట్లు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధప్రదేశ్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా 4.11శాతానికి తగ్గిందని చెప్పారు. జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపులు చేయడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు. పీఎం కిసాన్‌ ‌పథకంలోనూ రాష్ట్ర వాటా తగ్గిందన్నారు. నరేగాకు గతంలో రూ.1.11 లక్షల కోట్లు కేటాయిస్తే.. ఈసారి కేవలం రూ.73వేల కోట్లకు పరిమితం చేశారని ఆక్షేపించారు.

’’విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి దాదాపు అరగంటకుపైగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించాం. ఈ పరిశ్రమపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు ఉన్నాయని మంత్రి దష్టికి తీసుకెళ్లాం. ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి తదుపరి నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. ఈ అంశంపై నీతీఆయోగ్‌కు కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తాం. ప్రజలకిచ్చిన హావి•లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసేలా తెదేపా వ్యవహరించకూడదు. ప్రత్యేక హూదా, విశాఖ ఉక్కు కర్మాగారం సహా విభజన హావి•ల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలి. దిల్లీలో అనవసరపు వ్యవహారాలు నడపొద్దు‘ అని వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave a Reply