Take a fresh look at your lifestyle.

వైఎస్‌ఆర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు

వైఎస్‌ఆర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని  కాంగ్రెస్‌ ‌నేత ఆది శ్రీనివాస్‌ అన్నారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్ర దివంగత  ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రా•శేఖర్‌రెడ్డి 71వ జయంతిని వేములవాడలోని కాంగ్రెస్‌  ‌నాయకుడు ఆది శ్రీనివాస్‌ ‌బుధవారం నిర్వహించారు.ఆది శ్రీనివాస్‌ ‌తన ఇంటిలో వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి,నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌తో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర అభివృద్దికి వైఎస్‌చేసిన కృషి,సాగునీటి ప్రాజెక్టుల కోసం వైఎస్‌ ‌చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌ ‌మానేరు ప్రాజెక్టు నిర్మాణానికి,వరద కాలువ నిర్మాణానికి వైఎస్‌ఆర్‌ ‌చేసిన కృషి ప్రజలంతా గుర్తు చేసుకుంటున్నారని అన్నారు.వేములవాడ నియోజక వర్గ అభివృద్ధికి సైతం వైఎస్‌ఆర్‌ ‌ప్రత్యేక దృష్టి సారించారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ‌పార్టి నాయకులు చిలుకు రమేశ్‌,‌కూరగాయల కొమురయ్య,సంగస్వామి యాదవ్‌,‌చంద్రగిరి శ్రీనివాస్‌ ‌గౌడ్‌,‌జగన్‌,‌వస్తాదు కృష్ణ,ప్రభాకర్‌రెడ్డి,అరుణ్‌తేజాచారి తదితరులు పాల్గొన్నారు.
రోగులకు పండ్లు పంపిణీ
ఎల్లారెడ్డిపేట : దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వైఎస్‌ఆర్‌ ‌జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి అశ్విని ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వైఎస్‌ఆర్‌ ‌చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ మండలం అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, జిల్లా ఉపాధ్యాక్షుడు షేక్‌ ‌గౌస్‌ ‌మాట్లాడుతూ…. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ‌రాజశేఖర్‌రెడ్డి చేసిన ప్రజా అభివృద్ది మరవలేనిదన్నారు.  జలయజ్ఞంలో కరువు భూమిని సస్యశ్యామలం చేయడం జరిగిందన్నారు.  రేపటి భవి ష్యత్తుపై  విద్యార్థులకు ఫీజ్‌ ‌రీయంబర్స్‌మెంట్‌ ‌వరంగా ఇచ్చి, ఆగుతున్న గుండెలకు ఆరోగ్యశ్రీని మహాభాగ్యం గా నెలకొల్పిన మాహానేత రాజశేఖర్‌రెడ్డి నిరుపేదల పట్ల  దయాగుణం, సంక్షేమ పథకాలతో ఊరూర అభివృద్ధిని చేసి జన హృదయాల్లో చెరగని ముద్రను నెలకొల్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు మైనార్టీ అధ్యక్షుడు షేక్‌ ‌సాహేబ్‌, ఎసిసెల్‌ అధ్యక్షుడు కరికే శ్రీనివాస్‌, ‌బ్లాక్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు సద్ది )క్ష్మారెడ్డి,  పట్టణ అధ్యక్షుడు పందిర్ల లింగంగౌడ్‌, ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానుక నాగరాజు, సోషల్‌మీడియా కోర్డినేటర్‌ ‌రాజునాయక్‌, ‌సేవదల్‌ అధ్యక్షుడు బచ్చాగౌడ్‌, ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు బుచ్చి లింగం సంతోష్‌గౌడ్‌, ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌చిన్ని బాబు,  పాల్గొన్నారు.
కాలనీలో జయంతి వేడుకలు
యైటింక్లయిన్‌కాలనీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని బుధవారం యైటింక్లయిన్‌కాలనీ పట్టణ కాంగ్రేస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రేస్‌ అధ్యక్షులు గుండేటి రాజేష్‌ ‌ముఖ్యఅతిథిగా పాల్గొని వైఎస్‌ ‌చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బర్త్‌డే కేక్‌ ‌కట్‌ ‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్‌ ‌మారెల్లి రాజిరెడ్డి, నాయకులు సదానందం, కేశవులు, గడ్డం తిరుపతి, ఎస్‌.‌తిరుపతి, రజియా బేగం, విజయ్‌, ‌రబ్బాని, స్వర్ణలత, కళావతితో పాటు కాంగ్రేస్‌ ‌నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!