పేదల పక్షపాతి దివంగత నేత అని నివాళి
విజయవాడ,జూలై 8 : నగరంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ , మల్లాది విష్ణు నివాళులర్పించారు. ప్రతి పేదవాడి గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచారని.. వైఎస్ఆర్ అడుగు జాడల్లో సీఎం జగన్ వెళ్తున్నారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. పేదలందరి జీవితాల్లో వైఎస్ఆర్ వెలుగులు నింపారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రతి పేదవాడి గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచారన్నారు. వైఎస్సార్ అడుగుజాడల్లో జగన్ వెళ్తున్నారని తెలిపారు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత జగన్ సొంతమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఆరోగ్యానికి జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ…వైఎస్సార్ ఆశయ సాధన కోసం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేత దేవినేని ఉమ నోరు అదుపులో పెట్టుకోవాలని…. వైఎస్సార్, జగన్ గురించి మాట్లాడితే రాష్ట్రంలో ఎక్కడ తిరగలేవని హెచ్చరించారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ…వైఎస్సార్ ఐదు సంవత్సరాల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. నేడు జగన్ పాలన చూసి ఓర్వలేక ప్రభుత్వంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే తలారి వెంకట్రావు జెండా ఆవిష్కరించారు. అనంతరం దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో వృద్ధులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి అనిల్‌కుమార్. ‘తండ్రి ఆశయాలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. అన్నివర్గాల సంక్షేమాన్ని చూస్తూ జనహృదయనేతగా ఎదుగుతున్నారని అంటూ
అనిల్ తెలిపారు.