సంక్షేమ పథకాల ప్రధాత, అన్నదాతల ఆత్మబంధువు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలను వరంగల్ జిల్లా, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ రావు డాక్టర్ వైఎస్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాల ప్రధాత, అన్నదాతల ఆత్మబంధువు అందరి ముఖ్యమంత్రి వైఎస్సార్ అని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉచిత కరెంట్ పై తొలి సంతకం, రైతులకు ఋణాలు మాఫీ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.2లక్షల ఆర్ధిక సాయం తో తన కార్యక్రమాలను ప్రారంభించారన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం, పేద విద్యార్థులకు ఫీజు రియబర్స్‌మెంట్, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు సంక్షేమ పథకాలు అందజేశారని కొనియాడారు.
గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ని 23 జిల్లాలను కలుపుకొని చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 1475 కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్ర వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు పెంపు 104, 108 ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. కాంగ్రెస్ పథకాలనే ఇప్పటి ప్రభుత్వం పేర్లు మార్చి వాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్, ఈవి శ్రీనివాస్ రావు, టిపిసిసి కార్యదర్శు కొత్తపల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాష్, టిపిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాహత్ పర్వీన్, గ్రేటర్ వరంగల్ మహిళా కాంగ్రెస్ చైర్మన్ బంక సరళ సంపత్ యాదవ్, గ్రేటర్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కంది కొండ చిన్న రాజు, గ్రేటర్ ప్రధాన కార్యదర్శులు బొంత సారంగం, అజఘర్, గుంటి స్వప్న, సత్తు రమేష్, డివిజన్ అధ్యక్షులు ఏ సురేందర్, దాసరి రాజేష్, దొంగల కుమారస్వామి, బొట్ల సదానందం, మిట్ట నిశాంత్ గౌడ్, నాగపూరి దయాకర్, నాయకులు కట్ల భరద్వాజ్, ఎండి జాఫర్, ఎండి జమీరుద్దీన్, పల్లకొండ సతీష్, తోట పవన్, కమలాకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.