Take a fresh look at your lifestyle.

ఘనంగా వైఎస్‌ఆర్‌ ‌జన్మదిన వేడుకలు

మందమర్రి, జూలై 8, ప్రజాతంత్ర విలేఖరి :మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైస్‌.ఎస్‌.‌రాజశేఖర్‌ ‌రెడ్డి జన్మదినం వేడుకలను మందమర్రి కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో బుధవారం  కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్‌ ‌నాయకులు ఉమ్మడి జిల్లా మాజీ జనరల్‌ ‌సెక్రెటరీ సొతుకు సుదర్శన్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి, కేక్‌కట్‌ ‌చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకోని మాజీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి సొతుకు సుదర్శన్‌, ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌  ‌రాహుల్‌ ‌గాంధీ బ్రిగేడ్‌ ‌కాంగ్రెస్‌ ‌మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్‌ ‌తోగరి మాట్లాడుతూ రాజశేఖర్‌ ‌రెడ్డి లాంటి గొప్ప నాయకున్ని కాంగ్రెస్‌ ‌పార్టీ కోల్పోయిందని, రాజశేఖర్‌ ‌రెడ్డి హాయంలో కాంగ్రెస్‌ ‌పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్‌ ‌పార్టీ హాయంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, 108 అంబులెన్స్, ఆరోగ్య శ్రీ, ఫిజ్‌రియాంబర్స్‌మెంట్‌, ‌ప్రాజెక్టులు, రేషన్‌ ‌కార్డు ఉన్న వారికి తొమ్మిది రకాల సామానులు ఇచ్చిన ఘనత రాజశేఖర్‌ ‌రెడ్డిది అన్నారు.

రాజశేఖర్‌ ‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి చేసిన సేవలు జనాలు మర్చిపోలేరు అని, ప్రతి వ్యక్తికి న్యాయం జరిగిందంటే అది రా•శేఖర్‌ ‌రెడ్డి చలవే అని అన్నారు. రాజశేఖర్‌ ‌రెడ్డి మరణం తరువాత చాలా మంది ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవడం జరి గిందని, రాజశేఖర్‌ ‌రెడ్డి పథకాలన్నింటిని కేసీఆర్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పథకాలకు తూట్లు పొడుస్తూ ప్రజానీకానికి అన్యాయం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు •నాయించి, అణచివేయడం దుర్మార్గపు చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో మడే శ్రీనివాస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అభిమాని సొతుకువరణ్‌ ‌చంద్ర ప్రకాష్‌రావు, సొతుకు రాజయ్య, రామిళ్ళ కళ్యాణ్‌, ‌మొబిన్‌, అనుష్‌ ‌కుమార్‌ (‌చింటు) తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!