Take a fresh look at your lifestyle.

వైఎస్‌ ‌వివేకా హత్య కేసులో…. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా విచారణ తగదు

మరోమారు హై•కోర్టులో ఏపి ఎంపి అవినాశ్‌ ‌పిటిషన్‌

‌హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 10 : ‌మాజీ మంత్రి వైఎస్‌ ‌వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌ ‌రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాను వేసిన పిటిషన్‌లో మధ్యంతర దరఖాస్తు చేస్తూ పిటిషన్‌ ‌దాఖలు చేశారు. మార్చి 14న సీబీఐజరిపిన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డ్‌ను ఇవ్వాలని కోర్టును వైపీపీ ఎంపీ కోరారు. వివేకా హత్య కేసులో ఇటీవల అవినాష్‌ ‌రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. ఇప్పటి వరకు నాలుగుసార్లు సీబీఐ విచారణకు అవినాష్‌ ‌రెడ్డి హాజరయ్యారు. అయితే హత్య కేసులో విచారణకు హాజరుకాకుండా మినహాయింపు కోసం గతంలో అవినాష్‌ ‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అవినాశ్‌రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు విచారించకుండా అడ్డుకోవాలన్న ఆయన అభ్యర్థననూ తోసిపుచ్చింది. అయితే తీర్పు వెలువరించేదాకా ఆయన్ను అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి వైఎస్‌ ‌భాస్కర్‌రెడ్డి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుంది. ఏ4 నిందితుడు దస్తగిరినీ అవ్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాల్‌ ‌చేస్తు పిటిషన్‌ ‌దాఖలైంది. ఇదే అంశంపై ఎం వి కృష్ణారెడ్డి మరో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ రెండు పిటీషన్‌లను కలిపిన్యాయస్థానం విచారణ జరుపనుంది. కాగా.. దస్తగిరి స్టేట్మెంట్‌ ఆధారంగానే అవినాష్‌ ‌రెడ్డి, భాస్కర్‌ ‌రెడ్డిలను సీబీఐ విచారించింది. దస్తగిరి స్టేట్మెంట్‌ ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదని భాస్కర్‌ ‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్‌ ఇస్తున్నారని భాస్కర్‌ ‌రెడ్డి ఆరోపించారు. కీలక పాత్ర పోషించిన దస్తగిరికి బెయిల్‌ ఇవ్వటం సరికాదన్నారు. వివేక హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరినే అని తెలిపారు. దస్తగిరి బెయిల్‌ ‌సమయంలోను సీబీఐ సహకరించిందని చెప్పారు. దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదని అన్నారు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని భాస్కర్‌ ‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

Leave a Reply