Take a fresh look at your lifestyle.

పార్టీ పెడితే అందరికీ చెప్పే పెడతా..

  • వైఎస్‌ ‌హయాంలో రైతు రాజుల బ్రతికాడు
  • రాజన్న రాజ్యం తెలంగాణలో ఉందా !
  • వైఎస్‌ ‌లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది: వైఎస్‌ఆర్‌ ‌కుమార్తె షర్మిల

‌రాజన్న రాజ్యం ఉందా.. ఇప్పుడు ఇక్కడ లేదు…అంటూ షర్మిల ప్రసంగం సాగింది. అభిమానులకు అభిదాదం చేస్తున్న సందర్భంగా మాట్లాడిన తొలిమాటలు ఇవి. దివంగత వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి తనయ వైఎస్‌ ‌షర్మిల ఆత్మీయ సమ్మేళనాన్ని లోటస్‌పాండ్‌లో ప్రారంభించారు. అంతకుముందు ఆమె వేదికపైకి వొచ్చి తనను కలిసేందుకు వొచ్చిన నాయకులు, అభిమానులకు అభివాదం చేశారు. షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారాలు సాగిన నేపథ్యంలో ఆమె ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం విశేషం. తెలంగాణలో రాజన్నరాజ్యం లేదని, వైఎస్‌ ‌లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని షర్మిల పేర్కొన్నారు.

వైఎస్‌ ఉన్న రోజుల్లో తెలంగాణలో రైతు రాజుల బ్రతికాడని, కానీ, రాజన్న మరణం తరువాత తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాజన్నరాజ్యం తనతోనే సాధ్యం అవుతుందని షర్మిల పేర్కొన్నారు. రాజన్నరాజ్యం తిరిగి సాధించేందుకే ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తాను మాట్లాడటానికి రాలేదని, చెప్పింది వినేందుకే వచ్చానని నల్గొండ జిల్లా నేతల ఆత్మీయ సమావేశంలో పేర్కొన్నారు. మొత్తంగా తెలంగాణలోని వైఎస్సార్‌ అభిమానులు, కార్యకర్తలు, అనుచరులతో వైఎస్‌ ‌షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మొదట నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేతలతో షర్మిల సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలు, నేతలతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘రాజన్నను అభిమానించే ప్రతి గుండెకు.. రాజన్న బిడ్డ శిరస్సు వంచి, చేతులు జోడించి నమస్కారం తెలియజోస్తోంది’ అని షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వైఎస్సార్‌ ‌లేని లోటు తెలంగాణలో ఉందని.. రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలన్నదే తన కోరిక అని షర్మిల తన మనసులోని మాటను బయటపెట్టారు. ‘నేను ఇక్కడికి మాట్లాడటానికి రాలేదు. వి•రు చెప్పింది వినడానికి.. అర్థం చేసుకోవడానికి మాత్రమే నేను ఇక్కడికి వొచ్చాను. రాజన్న బిడ్డ ఒక్క మాట పిలవగానే ఇంత దూరం వొచ్చిన వి• అందరికీ కృతజ్ఞతలు. రాజన్న రాజ్యంలో ప్రతిరైతు రాజులా బతికారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలి. రాజన్న రాజ్యం నాతోనే సాధ్యం అని నా నమ్మకం.

- Advertisement -

రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాడికి ఒక పక్కా ఇల్లు ఉండాలని కలలు కన్నారు. ప్రతి పేద విద్యార్థి గొప్ప చదువులు చదవాలని.. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని రాజన్న అనుకున్నారు. పేదరికం అన్నది ఒక శాపమని.. దాన్ని రూపుమాపాలని నాన్నగారు శ్రమించారు. పేదవాడు అనారోగ్యంతో అప్పులు కాకూడదని.. చనిపోకూడదని ఆరోగ్య శ్రీ తెచ్చారు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అవన్నీ వి•కు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే రాజన్న రాజ్యం రావాలని నా కోరిక. ఈ పక్రియలోనే.. ఇందులో భాగంగానే ఇవాళ ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించాం. మికు తెలిసినంతగా నాకు తెలియదు.

మిమి స్వస్థలాల్లో మిరేం చేశారు..? మిసలహాలు, మిసూచనలు ఇవ్వండి. మిరు చెప్పే విషయాలు వినడానికి.. అర్థం చేసుకోవడానికే నేను వచ్చాను.. వెల్‌ ‌కమ్‌..’ అని తన ప్రసంగాన్ని షర్మిల ముగించారు. ఉదయం10 గంటలకు లోటస్‌పాండ్‌ లోని తన నివాసంలో నల్గొండ జిల్లా కార్యకర్తలతో భేటీ అయ్యారు. 100 మంది ముఖ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. నేటి నుంచి తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల వారీగా షర్మిల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నారు.

పార్టీ అజెండా, కార్యాచరణ లాంటి అంశాలపై కార్యకర్తలతో చర్చలు జరుపుతారు. చర్చల అనంతరం పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా లోటస్‌పాండ్‌లోని షర్మిల నివాసం వద్ద భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ప్లెక్సీల్లో ఎక్కడా జగన్‌ ‌ఫోటోలు, వైసీపీ జెండాలు కనిపించకపోవడం విశేషం.

Leave a Reply