Take a fresh look at your lifestyle.

అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ నిర్ణయం

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని రథం ఎలా అగ్నికి ఆహుతైందన్న అంశాన్ని ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకున్న ముఖ్య మంత్రి వైఎస్ జగన్ కేసు దర్యాప్తును
సీబీఐ కి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ పోలీసు సవాలుగా తీసుకున్న తర్వాత కూడా కొన్ని రాజకీయ శక్తులు, బృందాలు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది.
కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. పూర్తి పారదర్శకమైన ప్రభుత్వంగా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం సీబీఐ దర్యాప్తును కోరుతూ హోం శాఖకు లేఖ పంపింది. దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ..  రేపు జీవో వెలువడనుంది.

Leave a Reply