Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో కక్షసాధింపు రాజకీయాలు

  • ఫ్యాక్షన్‌ ‌రాజకీయాలు నడుపుతున్న జగన్‌
  • ‌బిసి జనార్దన్‌ ‌రెడ్డిపై కేసులను తప్పుపట్టిన చంద్రబాబు

అమరావతి,మే 26 : రాష్ట్రంలో కొందరు పోలీసులు వైసీపీ నాయకుల్లా పనిచేస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన డియాతో మాట్లాడుతూ రఘురామను కొట్టినందుకు సీబీఐ విచారణ ఎదుర్కుంటోందని అన్నారు. సీఎం జగన్‌రెడ్డి ఏమాత్రం సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జగన్‌ను నమ్మకున్నవాళ్లు ఇప్పటికే జైలుకు వెళ్లొచ్చారని.. పోలీసులకూ ఇదే గతి పడుతుందని ఈ విషయాన్ని గుర్తుపెట్టు కోవాలన్నారు.

ప్రభుత్వాలు శాశ్వతం కాదని, దౌర్జన్యాలను వడ్డీతో సహా చెల్లించేరోజు దగ్గరలోనే ఉందని చంద్రబాబు అన్నారు. బీసీ జనార్ధన్‌రెడ్డి చేసిన తప్పేంటని చంద్రబాబు ప్రశ్నించారు. హింసను ప్రేరేపించే విధంగా జనార్ధన్‌రెడ్డి ఎప్పుడూ పనిచేయలేదన్నారు. అభివృద్ధి కోసం నిరంతరం ఆకాంక్షించా రన్నారు. జనార్ధన్‌రెడ్డి ఇంటి దగ్గరకు కాటసాని రామిరెడ్డి అనుచరులు ఎందుకొచ్చారని బాబు నిలదీశారు. గొడవ చేసిన వారిపై కాకుండా బాధితులపై కేసులు పెట్టడమేంటని మండిపడ్డారు.

టీడీపీ ఎప్పుడూ ముఠా రాజకీయాలకు దూరమని, జగన్‌ అధికారంలోకి వచ్చి ఫ్యాక్షన్‌ ‌రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. అక్రమ కేసులు బనాయించి సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో శాడిస్ట్ ‌సీఎం పాలన చూస్తున్నామని మాజీమంత్రి అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.టీడీపీ నేతలను తప్పుడు కేసులతో అరెస్ట్ ‌చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వాలు శాశ్వతం కాదని పోలీసులు గుర్తుంచుకోవాలని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. దాడి చేసినవారిని వదిలి బాధితులపైన కేసులా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం ఆపాలన్నారు. టీడీపీ నేత జనార్ధన్‌రెడ్డి, అనుచరులు ఇచ్చిన ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply