Take a fresh look at your lifestyle.

వెంటాడుతున్న ఎంఫాన్‌ ‌తుఫాన్‌ అ‌ప్రమత్తం అయిన ఎపి సర్కార్‌

అమరావతి,మే 5: ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రజల నెత్తిన మరో పిడుగు పడబోతోంది.ఎంఫాన్‌ ‌తుపాను దూసుకుని వచ్చే ప్రమాదం ఉండడంతో సర్కార్‌ అ‌ప్రమత్తం అయ్యింది. ఇప్పటికే అధికారులను సిఎం జగన్‌ అ‌ప్రమత్తం చేశారు. తుపాను ఇప్పుడు ఏపీ వైపు దూసుకొస్తోంది . ఇప్పటికే రైతుల పంట కళ్లాల్లో ఉండిపోయింది. కరోనాతోనే రైతు నష్టపోతుంటే ఇప్పుడు తుపాన్‌ ‌భయపెడుతోంది.అయితే ఎంపాన్‌ ‌తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ తుపాను ఆంధ్రప్రదేశ్‌ ‌వైపు వస్తే సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ అధికారులను హెచ్చరించారు. తుపాను కదలికలను గమనించాలని, దీనిపై విద్యుత్తు, రెవిన్యూ , పౌరసరఫరాలు, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ ‌సూచించారు.

తుఫాను వల్ల ఆస్తినష్టం , ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని , చేపల వేట నిషేధ సమయమే అయినా బోట్లలో ఏ ఒక్కరూ సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలని జగన్‌ అధికారులకు సూచించారు . తుపాను ద్వారా రైతులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి పంటలో మూడింట ఒక వంతు పంటను మార్కెట్లో జోక్యం కింద కొనుగోలు చేయడానికి అధికారులు సన్నద్ధం కావాలని జగన్‌ ఆదేశించారు . వీటి కోసం మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుంటే ధరల్లో కూడా స్థిరీకరణ వస్తుందని జగన్‌ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు రావాలంటే పండే పంటలో మూడింట ఒక వంతు కొనుగోలు చేయాలని జగన్‌ అం‌టున్నారు .గతంలో పెరిషబుల్‌ ‌గూడ్స్‌ను ప్రభుత్వం ఎప్పుడూ కూడా సేకరించలేదని అధికారులు ముఖ్యమంత్రికి గుర్తు చేశారు.

Leave a Reply