Take a fresh look at your lifestyle.

అసోం సిఎం సోనావాల్‌కు జగన్‌ ‌ఫోన్‌

  • చేపల ఎగుమతులకు అనుమతించాలని వినతి
 ‌దేశంలో కరోనాని పూర్తి స్థాయిలో అరికట్టడానికి సీరియస్‌ ‌గా లాక్‌ ‌డౌన్‌ ‌కొనసాగుతుంది. అయితే మొన్న 14 వరకు లాక్‌ ‌డౌన్‌ ఉన్నా.. దాన్ని మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రవాణా వ్యవస్థపై 20 తర్వాత కొన్ని మార్గ నిర్దేశాలు జారీచేశారు. తాజాగా లాక్‌ ‌డౌన్‌ ‌పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌ అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌ ‌కు ఫోన్‌ ‌చేశారు. చేపల ఎగుమతులకు ఉన్న అడ్డంకులను తొలగించాలని అసోం సీఎంను కోరారు. ప్రస్తుతం చేపల ఎగుమతి విషయంలో అసోం సరిహద్దుల్లో లారీలు నిలిచిపోకుండా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
జగన్‌ ‌విజ్ఞప్తికి అసోం సీఎం శరబానంద సానుకూలంగా స్పందించారు. అన్ని రకాల చర్యలు తీసుకుంటా మని హా ఇచ్చారు. నిత్యావసర వస్తువుల రవాణాకు సానుకూలంగా ఉన్నట్లు తెలిసిందే. ఏప్రిల్‌ 20 ‌నుంచి దశలవారీగా ఆంక్షలు సడలించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఎల్లుండి సోమవారం నుంచి అనేక సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా ఆయన, ఏపీలో నిలిచిపోయిన అసోం వాసులను ఆదుకోవాలని సీఎం జగన్‌ ‌ను కోరగా, అన్ని రకాలుగా అండగా నిలుస్తామని సీఎం జగన్‌ ‌బదులిచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!