అమరావతి,సెప్టెంబర్ 8 : ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) మృతిపై ఎపి సిఎం వైఎస్ జగన్ దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. జయప్రకాశ్‌రెడ్డి మృతి పట్ల ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జయప్రకాశ్‌రెడ్డి చలనచిత్రరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని గుర్తు చేశారు.
మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు నిర్దారించారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో అప్పటి నుంచి ఆయన గుంటూరులోనే ఉంటున్నారు.