Take a fresh look at your lifestyle.

యువత రాజకీయాలో భాగస్వామ్యం కావాలి..

‘‘15 ‌సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్యవారిని యువతగా పేర్కొంది ఐక్య రాజ్య సమితి. యువత వయస్సుని ఒక్కో ప్రాంతం ఒక్కోలాగా పేర్కొంది. మన దేశంలో15 – 35 ఏళ్ల లోపు వారిని మన రాజ్యాంగం యువతగా చెపుతోంది. భారత జనాభాలో దాదాపు 60 శాతం యువత ఆ వయస్సుల వారే. 2020 నాటికి 60% యువత ఉంది. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు యువతే. మన దేశం ప్రపంచంలోనే యువత అధికంగా ఉన్న దేశం ఏర్పడింది.’’

ఇప్పుడు భారతదేశంలోని అందరి దృష్టి నేటి యువతపైనే. ఆశలు కూడా యువతపైనే. దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే చాలా వరకు ఉంది. ప్రస్తుతం భారతీయ సమాజంలోని ఎన్నో విద్యావేత్తలు, మేధావులు, ధనవంతులు ఉన్న ప్రతి ఒక్కరూ పాలకవర్గం నాయకత్వంలో యువకులు పని చేయాల్సిందే. మనది గొప్ప ప్రజాస్వామిక దేశం. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద దృఢ లిఖిత రాజ్యాంగం … ఆనాడు డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు మేలు చేయడానికి వారికి పాలక వర్గంలో చోటు కల్పించడానికి అవకాశం కల్పించారు. కానీ రాజ్యాంగంలోని లోసుగులను సవరణలు చేసుకుంటూ ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికలకు డబ్బున్న వారికి అవకాశాలు కల్పించే విధంగా వాతావరణం కల్పించి.. నేటికి ఇంత సాంకేతిక అభివృద్ధి గావించిన పేద, దళిత వర్గాలకు చెందిన పాలకవర్గం లోనికి రానివ్వకుండా జాగ్రత్తలు వహిస్తూ అల్ప సంఖ్యాక ప్రజలు పెత్తనం చెలాయిస్తున్నారని అనడంలో ఎలాంటి శక్తి లేదు. కుల ప్రాతిపదికన సమాజంలోని పేదరికం విభిన్న కులాల్లో చదువుకున్న మేధావులు రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని తమ హక్కుల సాధనకై తమ ప్రజలను చైతన్య పరుస్తూ …. ముందడుగు వరుసలో విభజించి – పాలించు అనే ధోరణితో ఎక్కడికక్కడ వర్గాలుగా చీల్చి అనేక్యతకు పాల్పడుతూ నామ మాత్రపు అరకొర అవకాశాలు కల్పిస్తూ ఎలాంటి నిర్ణ యాధి కారాలు తీసుకోకుండా ఉత్సవ విగ్రహలుగా మారుస్తు న్నారన డంలో నిజం లేక పోలేదు.

రాజ్యాంగ పరంగా నామమాత్రంగా ఎన్నిక అవుతున్నారు తప్ప ! తమ ప్రజల కోసం చేయాలని అనుకున్నా పనులు చేయలేని పరిస్థితిలు అనడంలో ఎలాంటి వాస్తవం లేదు. రాజకీయ,విద్యా, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వివిధ రంగాల్లో ఉన్నతమైన స్థానంలో నెలకొందన్నారు. కానీ నేడు పుట్టి పెరిగిన నేపథ్యంలోమొదటగా తమ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతానికి కృషి చేస్తుంది. ప్రస్తుతం నెలకొంటున్న పరిమాణాల దృష్ట్యా రాజకీయంగా ఎలాంటి సాహసాలకు పూనుకోవడం లేదనడంలో నిజం లేక పోలేదు. సమాజంలోని మహిళలకు రాజ్యాంగ పరంగా పురుషులతో సమానంగా రిజర్వేషన్‌ ‌కలిగి ఉన్నది. గత కొంతకాలంగా పురుషులకు సరిసమానంగా అన్ని రకాల కార్యకలాపాల్లో పాల్గొంటూ ‘మాకు ఎవరూ సాటి లేరు’ అని నిరూపిస్తూ చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కావాలని పోరాడుతూ వస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అక్కడక్కడ మహిళల పెత్తనం, అధికారం పురుషులు చూసుకుంటున్నారు. రాజ్యాంగ పరంగా మహిళలు ఎన్నికైన వారిని అడ్డం పెట్టుకుని మగవారి అధికారం చెలాయిస్తూ రాజకీయంగా ఎదగనివ్వకుండా లేదు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు..
ప్రస్తుతం అధిక శాతం కుటుంబంలోని మహిళలు నిర్ణయమే శిరోధార్యం. అలాంటి కుటుంబాలే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయని అనడంలో సైతం జగమెరిగిన సత్యం. వారికి పూర్తి స్వేచ్ఛ అవకాశం ఇస్తే వారి తెలివిని రుజువు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతెందుకు దేశానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన ఒక మహిళా శక్తి ఏమిటో నిరూపించ లేదా ? అలాంటిది ప్రస్తుతం రాజకీయ పట్ల మహిళామణులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నిస్వార్థ పూరిత పాలన జరగాలంటే ముందుగా పౌరులందరికీ రాజకీయ చైతన్యం రావాలి. ప్రతి ఒక్కరికి రాజ్యాంగం పట్ల అవగాహన హక్కులు విధులు గురించి పూర్తిస్థాయిలో తెలిసి ఉండాలి. సమాజంలోని ఎవరి జనాభా ఎంత ? వారు పొందే అవకాశాలెన్ని ? జరగాల్సిన అభివృద్ధి ఎంత ? ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయి ? తక్షణమే చేయాల్సిన కార్యకలాపాలు ఏమిటి ? ఎక్కడ అన్యాయం జరుగుతుంది ? పాలక పక్షాలు అనుసరిస్తున్న తీరు ఎలా ఉంది ? వాటిని అరికట్టే మార్గాలు ఏమిటి ? ప్రతిపక్ష పాత్ర ఎలా ఉండాలి ? ప్రసార సాధనాలు పనితీరు ఎలాంటి ఉండాలి ? ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తించాలి ? సమయానికి అనుగుణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ? ఇలాంటి పలు రకాల పై అంశాల పట్ల ప్రతి పౌరుడికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే రాజ్యాంగం పట్ల, సామాజిక పట్ల అవగాహన కల్పించే పాఠ్యాంశాలు పాఠశాల విద్య నుండి వయస్సుకు తగినట్లుగా ప్రతి తరగతిలో ప్రస్తుత వర్తమాన అంశాలపై ఆలోచింపజేసే విధంగా బోధన కొనసాగాలి. అలాగే ప్రసార సాధనాల ద్వారా ప్రతి ఒక్కరిని చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టాలి.

మీడియా, సామాజిక మాధ్యమం మధ్యతరగతి ప్రజానీకాన్ని చైతన్యవంతం చేయటంలో ప్రముఖపాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. యువత రాజకీయాల్లోకి వచ్చి సమాజ గతిని నిర్దేశించాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చెప్పేవారు. సమాజానికి చోదకశక్తి యువతరమే. యువత సామాజిక స్పృహ పెంచుకోవాలి. సమాజంలోని అధిక శాతంలో చదువుకున్న యువత ఉన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ‌ఫోన్‌ ‌సౌకర్యం ఉంది. ప్రతి ఒక్కరు రాజకీయ చైతన్యం కలిగేలా ప్రజాస్వామిక ఎన్నికల విధానంలో డబ్బులు ఖర్చు పెట్టే విధానానికి స్వస్తి పలకాలి. అరచేతిలో ప్రపంచ విజ్ఞానాన్ని తెలుసుకునే వెసులుబాటు ఉన్నది. ప్రతి గ్రామం నుండి యువత గల్లికో లీడర్‌ ‌గా ఉంటూ రాజకీయ నాయకులకు అనుచరులుగా మారుతున్నారు. కానీ నిర్దిష్ట లక్ష్యాలు లేకుండా కేవలం తాత్కాలిక తాయిలాలకు ఆశపడుతూ ఒకరిపై మరొకరు పగలు, ప్రతికారాలు ఏర్పరచుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన పాలకవర్గం, ప్రజలకు జవాబు దారీతనంతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదు..అనే సామెత మాదిరిగా ప్రతి ఒక్కరు న్యాయపరంగా హక్కుల కోసం ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవల్సిన అవసరం ఉంది. కావున ఆ ధోరణిలో అడుగులు వేయాలి. సమస్యలపై ప్రజలను నిరంతరం చైతన్యవంతం చేయాలి. సమాజంతో సంపర్కంలో ఉండేందుకు తగిన కార్యక్రమాలను ఎన్నుకోవాలి. జీవితంలో స్థిరపడిన యువత తమవంతు కర్తవ్యంగా సమాజాభివృద్దికి తప్పకుండా దోహదపడాలి. రాజకీయ రంగంలో యువత రాణించాలి. చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించినప్పుడే దేశానికి ఉపయోగపడే మార్గదర్శకాలను తయారు చేసే వీలుంటుంది.

15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్యవారిని యువతగా పేర్కొంది ఐక్య రాజ్య సమితి. యువత వయస్సుని ఒక్కో ప్రాంతం ఒక్కోలాగా పేర్కొంది. మన దేశంలో15 -35 ఏళ్ల లోపు వారిని మన రాజ్యాంగం యువతగా చెపుతోంది. భారత జనాభాలో దాదాపు 60 శాతం యువత ఆ వయస్సుల వారే. 2020 నాటికి 60% యువత ఉంది. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు యువతే. మన దేశం ప్రపంచంలోనే యువత అధికంగా ఉన్న దేశం ఏర్పడింది.సమస్యలపై ప్రజలను నిరంతరం చైతన్యవంతం చేయాలి.ఎప్పుడైతే సమాజంలో ప్రతి ఒక్కరికీ రాజకీయ చైతన్యం కలిగి తమ హక్కుల సాధనలో పోరాట పడిమను చూపుతూ అభివృద్ధికి పాటుపడే ప్రభుత్వాలను ఎన్నుకొని అనుక్షణం, అప్రమత్తం చేస్తూ నిస్వార్ధంగా ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా అర్హత కలిగిన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందే విధంగా పాటుపడుతూ రాబోయే రాజకీయాలోకి యువత ముందుకు సాగాలి.

lakavath chiranjeevi
లకావత్‌ ‌చిరంజీవి నాయక్‌
‌కేయూ వరంగల్‌

Leave a Reply