Take a fresh look at your lifestyle.

వ్యాక్సిన్‌ ‌కోసం యువత ఎదురుచూపు

కొరోనా టీకాను ప్రభుత్వం నిలిపివేయడంతో లక్షలాది మంది యువత ఆందోళన చెందుతోంది. వ్యాక్సినేషన్‌ ‌వేసుకొనే వారి సంఖ్య పెరగడంతో కొరత ఏర్పడింది. దీంతో రోజువారీ టార్గెట్‌ ‌ప్రకారం వ్యాక్సినేషన్‌ ‌చేయాలని ప్రభుత్వాల నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్‌ ‌రావడంతో తిరిగి ఆన్‌లైన్‌ ‌రిజిస్టేష్రన్‌లో స్లాట్‌ ‌బుకింగ్‌ ‌విధానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తం గా జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమాన్ని ప్రారంభిం చింది. మొదటి దశలో వైద్య ఆరోగ్యశాఖలో టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించగా అంచెలంచెలుగా కొరోనా సేవలందించిన ప్రభుత్వ శాఖల తోపాటు సామాన్య ప్రజలకు వేశారు. మొదట్లో టీకాపై అవగాహన లేకపోవడం, దుష్పలితాలు ఉంటాయనే భయంతో ప్రజలు వ్యాక్సినేషన్‌కు ముందుకు రాలేదు.

క్రమంగా అవగాహన పెరగడంతో వ్యాక్సినే షన్‌ ‌చేయించుకొనే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. మరోవైపు కొరోనా రెండో దశ విజృంభించి పాజిటివ్‌ ‌కేసులు పెరగడం, మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురై టీకా వేసుకొనేందుకు క్యూ కడుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు సరిపడా వ్యాక్సిన్‌లు అందుబాటులో లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి డోసు టీకాలను పూర్తిగా నిలిపివేసింది. కేవలం రెండో డోసు మాత్రమే వేయాలని ఆదేశాలు జారీ చేసింది. మొదటి డోసు వేసుకున్న వారికి మాత్రమే రెండో డోసు టీకాలు ఇస్తున్నారు. ప్రభుత్వాలు నిర్ణయించిన ప్రకారం మొదటి డోసు వేసుకున్న తరువాత 28 నుంచి గరి ష్టంగా 40 రోజులలోపు రెండో డోసు తీసుకోవాలి. ఈ వ్యవధిని కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది.

మొదటి డోసులో ఏ కంపెనీ టీకా వేసుకుంటే రెండో డోసులోనూ అదే టీకాను తీసుకోవలసి ఉంటుంది. ఈ మేరకు మొదటి డోసు వేసుకున్న ప్రజలకు సరిపడా రెండో డోసు టీకాలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం నేరుగా వెళ్ళి ఆధార్‌, ‌మొదటి డోస్‌ ‌వేసుకున్న మెసేజ్‌ ‌చూపిస్తే రెండో డోస్‌ ‌వేస్తున్నారు. టీకా పంపిణీ ప్రారంభమైనప్పటి నుంచి వ్యాక్సినేషన్‌ ‌జరిగింది. ఇందులో కొవాగ్జిన్‌, ‌కొవిషీల్డ్ ‌టీకాలు ఉన్నాయి. మొదట్లో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ టీకాలు వేసారు. కేంద్ర ప్రభుత్వం 18-45 సంవత్సరాల వారికి కూడా టీకాలు వేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆ వయస్సుగల వారు అంతా రిజిస్టేష్రన్‌ ‌చేయించుకున్నారు. అయితే 45 సంవత్సరాల పైబడిన వారికి మొదటి డోసును నిలిపివేసిన ప్రభుత్వం మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో 18-44 లోపు యువతకు టీకాలు ఎప్పుడిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Leave a Reply